Praja Deveena
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 2:36 am Posted by : prajadeveena.com

Miryalaguda Cylinder Blast: మిర్యాలగూడలో అగ్నివిషాదం.. ముగ్గురు మృతి

Miryalaguda Cylinder Blast: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒకే కుటుంబానికి చెందిన అమ్మమ్మ, మనవడు, మనవరాలు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది.

కలాల్వాడ ప్రాంతంలోని ఓ పెంకుటింట్లో నివసిస్తున్న వనం చంద్రకళ (Vannam Chadrakalla) తన ఇద్దరు మనవళ్లతో గురువారం రాత్రి నిద్రలో ఉండగా ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ (Electrical Short Circuit Fire) కారణంగా ఇంట్లో మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు.

మంటలను గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించినప్పటికీ, ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ అకస్మాత్తుగా పేలిపోవడంతో పరిస్థితి మరింత విషమించింది. క్షణాల్లో మంటలు ఇల్లంతా వ్యాపించడంతో చంద్రకళ (45), లక్ష్మణ్ (16), ప్రణతి (14) బయటపడే అవకాశం లేకపోయింది. ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడైంది.

Also Read:NH65 National Highway oiltanker accident : బిగ్ బ్రేకింగ్, హైవే 65పై ‘ల్యాండ్ ట్యాంకర్’ కలకలం, హయత్‌నగర్ జంక్షన్ వద్ద ఏం జరిగింది 

ఈ ఘటన కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. చంద్రకళ భర్త ఇటీవల అనారోగ్యంతో మరణించగా, పిల్లల తల్లి ఉపాధి కోసం పుణెకు వెళ్లిన నేపథ్యంలో మనవళ్ల బాధ్యతను ఆమెనే చూసుకుంటున్నట్లు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అనంతరం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై విచారణ కొనసాగుతోంది.