Miryalaguda Cylinder Blast: మిర్యాలగూడలో అగ్నివిషాదం.. ముగ్గురు మృతి
Miryalaguda Cylinder Blast: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒకే కుటుంబానికి చెందిన అమ్మమ్మ, మనవడు, మనవరాలు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. కలాల్వాడ ప్రాంతంలోని ఓ పెంకుటింట్లో నివసిస్తున్న వనం చంద్రకళ (Vannam Chadrakalla) తన ఇద్దరు మనవళ్లతో గురువారం రాత్రి నిద్రలో ఉండగా ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ (Electrical Short Circuit Fire) కారణంగా ఇంట్లో మంటలు చెలరేగినట్లు...