Miryalaguda Police: ప్రజా దీవెన, మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన అంతరాష్ట్ర అక్రమ బియ్యం వ్యాపారిపై రౌఢీ షీట్ తెరి చారు మిర్యాలగూడ పోలీసులు. రేషన్ బియ్యన్ని ప్రజల వద్ద నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తు ఆంధ్రప్రదేశ్ కు అక్రమంగా తరలిస్తున్న అంతరాష్ట్ర కేటుగాడు గా పేరుగాంచిన నరసింహారావు అనే అక్రమ వ్యాపారస్తున్ని మిర్యా లగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. దాచేపల్లి కి చెందిన నరసింహారావు ఇప్పటికే పలు కేసుల్లో నిందితు డి గా కొనసాగుతున్నాడు.
తెలంగా ణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతిసే విధంగా ప్రవర్తిస్తూ ప్రభుత్వ ఖజా నాకు భారీ నష్టం కలిగిస్తున్న ఈ కేటుగాన్ని ఆట కట్టించేందుకు పోలీసులు పగడ్బందీగా వ్యవ హరించారు. గత కొంతకాలంగా తప్పించుకు తిరుగుతున్న కేటు గాడు నరసింహారావును రెండు రోజుల క్రితం అదుపులోకి తీసు కోని చంచల్ గూడా జైలుకి తరలిం చారు. ఎవరైనా అక్రమ బియ్యం వ్యాపారము చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కేసును చెందించిన మిర్యాలగూడ రూరల్ సీఐ వీరబాబు, వాడపల్లి ఎస్ ఐ హరి, వాడపల్లి సిబ్బందికి పోలీసు ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు.