Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MJF leaders : రఘు కుటుంబానికి చిలుకూరు ఎం జె ఎఫ్ నాయకుల ఆర్థిక సహాయం

MJF leaders : ప్రజా దీవేన,కోదాడ: కోదాడ నియోజకవర్గ ఎలక్ట్రాన్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు ఈ సందర్భంగా చిలుకూరు మండల ఎం జె ఎఫ్ నాయకులు సోమవారం రఘు నివాస గృహానికి వెళ్లి రఘు భార్య మౌనిక పిల్లలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు అనంతరం రఘు చిత్రపటానికి వద్ద నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రఘు నియోజకవర్గ వ్యాప్తంగా ఎం జె ఎఫ్ కు ఎనలేని కృషి చేశారని విలేకరులకు ఎలాంటి ఆపద వచ్చినా ఆదుకొని ఆర్థిక సహాయాన్ని అందజేసేవాడని గుర్తు చేశారు రఘు కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో ఎం జె ఎఫ్, చిలుకూరు మండల అధ్యక్షులు కందుకూరి కృష్ణమూర్తి , ఉపాధ్యక్షులు మల్లెపంగు ఉపేందర్, కార్యదర్శి కాంపాటి శ్రీను, కార్యదర్శి కందుకూరి వంశీకృష్ణ, కోశాధికారి నూకపంగు వీరబాబు లు , ఎం జె ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, పిడమర్తి గాంధీ, ఎమ్ యస్ పి, నియోజకవర్గ ఇన్చార్జి జిల్లా అధికార ప్రతినిధి, ఏపూరి రాజు మాదిగ , ఎం జె ఎఫ్ నియోజకవర్గం అధ్యక్షులు శ్రీకాంత్, కోదాడ నియోజకవర్గ ఎం జె ఎఫ్ గౌరవ సలహాదారులు, సీనియర్ జర్నలిస్ట్ బంక వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు..