MLA Guntakandla Jagadish Reddy : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: నల్లగొండ తెలుగుదేశం పార్టీ ఆధ్వ ర్యంలో బిఆర్ఎస్ మాజీమంత్రి, సూర్యాపేట ఎ మ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి దిష్టిబొమ్మను శనివా రం దగ్ధం చేశారు. నల్గొండ పార్ల మెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాల యంలో నల్గొండ పార్లమెంట్ కన్వి నర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ టిడిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడుని తెలంగాణ గడ్డ పై తరిమి కొట్టినం మల్లి వస్తే తన్ని తరిమి కొడుతామని గుంటకండ్ల జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేస్తు న్నామని తెలిపారు. జగదీష్ రెడ్డి సిగ్గు లేకుండా స్థాయి మరిచి ఆలా మాట్లాడినందుకు బేషరతుగా చంద్రబాబు నాయుడుకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలు గుదేశం పార్టీ ని తెలంగాణ గడ్డ పై హైదరాబాద్ కేంద్రంగా పార్టీని ఆనా డు ఎన్టీఆర్ స్థాపించి అనేక సంక్షే మ పథకాలు ప్రారంభించి భారత దేశ వ్యాప్తంగా పేరొందిన నాయ కుడిగా గుర్తింపు పొందడం జరి గిందని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రo ఏ ఒక్కరి సొత్తు కాదని జగదీశ్వర్ రెడ్డి అంటూ హెచ్చ రిం చారు. త్వరలో చంద్రబాబు నా యుడి నాయకత్వంలో నల్గొండ గడ్డ పై లక్ష మందితో సభను పెట్ట డానికి సమాయత్తం అవుతున్నా మని తెలిపారు. రాష్ట్ర నాయకులు తుమ్మల మధుసూదన్ రెడ్డి, ఎల్ వి యాదవ్ లు మాట్లాడుతూ తెలు గు ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ నిస్వర్గీయ ఎన్ టి ఆర్ స్థాపించి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో దొరల గడీల పాలనను అంతమొం దించి బడుగు, బలహీన, దళిత వర్గాలను రాజకీయంగా, సామాజి కంగా, అత్యున్నత స్థాయి కల్పిం చిన మహా నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. చంద్రబాబు నాయుడు ఆర్ధికంగా వెనుకబడిన రాష్ట్రాన్ని హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని ప్రపంచ స్థాయిలో తెలం గాణ ఆర్ధిక స్థితి గతులను బలో పేతం చేసిన నాయకుడన్నారు. తెలంగాణ పేరు మీద అధికారంలో కి వచ్చి దోచుకొని, దాచుకొని విర్ర వీగుతున్న బిఆర్ ఎస్ నాయకులు సిగ్గుఎగ్గూ లేకుండా ఇష్టం వచ్చిన ట్లు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుగు ప్రజలు తరిమి తరిమి కొడుతారని హెచ్చరించా రు. మీ గురువు కొడుకు ఒక్క మా ట మాట్లాడినందుకు తెలంగాణ ప్ర జలు ఇంటికి పంపారని, ఇక నైనా తిక్క తిక్క మాటలు మాట్లాడటం బంద్ చేసి బేషరతుగా నారా చంద్ర బాబు నాయుడుకు క్షమాపణ చె ప్పాలని డిమాండ్ చేస్తున్నాము.ఈ కార్యక్రమం లో నాయకులు కూరెళ్ల విజయ్ కుమార్, ఆకునూరి సత్య నారాయణ, గుండు వెంకటేశ్వర్లు, తేలు అన్న రవి, బక్కతోళ్ళ ఇస్తారి, జంపాల చంద్రశేఖర్, గోగుల నాగ రాజు, కొండేటి దయాకర్, కొండల్ తదితరులు పాల్గొన్నారు.