— మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మె ల్యే జగదీశ్ రెడ్డి
MLA Jagdish Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: : సమైక్యాం ధ్ర పాలకుల కుట్రల వల్లే ఎస్ ఎల్బీ సీ సొరంగం పనుల నిర్మాణం పు రుడుపోసుకుందని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆరోపించా రు. సొరంగం ప్రమాద ఘటనా స్థలం దోమల పెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్తున్న సందర్భంగా గురువారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు. టన్నెల్ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై మోయలేని భా రం పడుతుందని ఆయన ఆరోపిం చారు. సొరంగం పనులకు ఉప యోగించే సాంకేతికత సరైంది కాదని తాము ఆనాడే చెప్పామని గుర్తు చేశారు.సొరంగంలో నీటి ఊ టను ఎదుర్కోవడానికి తాము చేసి న ప్రయత్నాలన్నీ విఫలమయ్యా యని గుర్తు చేశారు. అందువల్లే బి ఆర్ ఎస్ పాలనలో సొరంగం పను లు ముందుకు కదలలేదని జగదీశ్ రెడ్డి తెలిపారు. సొరంగంలో ఊరు తున్న నీటి ఊటను బయటకు పం పించేందుకు నెలకు కోటి న్నర వి ద్యుత్ ఖర్చు అవుతుందని చెప్పా రు. తాను విద్యుత్ శాఖ మంత్రిగా ఇవన్నీ పరిశీలించాకే విషయాలు చెబుతున్నానని చెప్పారు. ఇన్ని రకాల ఇబ్బందులు ఉండడం వల్లే తాము ఎస్ఎల్బీసీ సొరంగం పను లను ముందుకు ముందుకు తీసుకె ళ్లలేకపోయామని పేర్కొన్నారు.
సరైన అంచనాలేకుండా, నిష్ణాతుల అభిప్రాయాలుతీసుకోకుండా హడా వుడిగా సొరంగం పనులను చేపట్ట డంవల్లే కుప్పకూలిపోయిందని జగ దీశెడ్డిఆరోపించారు. ఎనిమిది మం ది కార్మికులు గల్లంతై ఆరురోజు లైనాఇప్పటి వరకు వారినిగుర్తించ కపోవడం ముమ్మాటికి ప్రభుత్వ అసమర్థతనే కారణమనిజగదీష్ రెడ్డి ఆరోపించారు. రెస్క్యూ పనుల ను పర్యవేక్షిస్తున్న మంత్రుల వ్యవ హారం చూస్తుంటే జోకర్లను మరి పించేలా వ్యవహరిస్తున్నారని ఎద్దే వా చేశారు. ఓ మంత్రి వాటర్ లో నీళ్లు కలుస్తున్నాయని, సొరంగం గోడకు చెవి ఆనించి సెల్ ఫోన్ రింగ్ అవుతుందని చెబుతూ వింతవింత గా ప్రవర్తిస్తున్నాడని ఎద్దేవా చేశా రు. ప్రాజెక్టుపై సరైన అవగాహనలేక మంత్రులు పరువు తీసు కుంటు న్నారని జగదీష్ రెడ్డి దుయ్య బట్టా రు. తాము ప్రమాదంపై రాజకీయం చేయడం లేదని ప్రభుత్వం అస మ ర్థతను ప్రశ్నిస్తున్నామని చెప్పా రు. విలేకరుల సమావేశం లో మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్ తదిత రులు పాల్గొన్నారు