Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mla komatireddy : పల్లెలకు చెరువులే ప్రాణాధారం

పల్లెలకు చెరువులే ప్రాణాధారం

ప్రజా దీవెన,మునుగోడు: గ్రామాలకు చెరువులే ప్రాణాధారం అని మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శని వారం మునుగోడు నియోజకవర్గంలో చిన్న నీటి వనరులను పటిష్ట పరచడానికి సమగ్రమైన కార్యాచరణ రూపొందించి పనులను మొద లుపెట్టాలని నీటిపారుదల శాఖ అధికారులతో హైదరాబాదులోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ భూమి మీదనే అత్యధిక ఫ్లోరైడ్ రక్కసివున్న ప్రాంతం మునుగోడు నియోజకవర్గమన్నారు.

ఇక్కడ కురిసే ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టి చెరువులకు మళ్ళించిన ట్లయితే భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయం కొంత మెరుగుపడే అవకాశం ఉందని అన్నారు.నియోజకవర్గంలో ఉన్న 669 చెరువుల్లో గొలుసు కట్టు చెరువులకు నీరు వచ్చే ఫీడర్ ఛానల్ లను పటిష్టం చేయడంతో పాటు ఆయా చెరువులలో పేరుకుపోయిన పూడికను తీయడం, కట్టలను పటిష్టం చేయడం లాంటి పనులను విడతల వారీగా పూర్తి చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను కోరారు.

దానికోసం డిసెంబర్ నెలలో చెరువులను పటిష్టం చేయడానికి సైట్ సర్వే పూర్తి చేసి అంచనాలు రూపొందించే పని పూర్తి చేయా లన్నా రు. జనవరి మాసం నుండి జులై మాసం వరకు ఆరు నెలల్లో ఎంపిక చేసిన చెరువులను పటిష్టం చేయాలన్నారు. వర్షాకాలం రావడానికి ముందే చెరువులను పటిష్టపరిచేలా ప్రణాళికలు ఉండాలని కోరా రు.

భూగర్భ జలాలను పెంచడానికి చెరువులతోపాటు వాగులపై ఎన్ని చోట్ల మత్తడి( మట్టితో నిర్మించే మినీ చెక్ డ్యాం) నిర్మాణాలు చేప ట్టాలి. వాగులపై ఎన్ని చోట్ల చెక్ డ్యాములు నిర్మించాలి, వెల్మకన్నే , శేషులేటి వాగు ఫీడర్ ఛానల్ పనుల పునరుద్ధరణ, గొలుసు కట్టు చెరువులతో పాటు మిగతా చెరువులలో నీటిని నింపడానికి కావల సిన వనరులను, చేపట్టాల్సిన పనులపై ఈ సమీక్ష సమావేశంలో చర్చించారు.విడతల వారీగా మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 669 చెరువులను పటిష్ట పరచాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో నియోజక వర్గం ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, ఏ.ఈ లు పాల్గొన్నారు.

Mla komatireddy