–జై చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దో నూరు జైపాల్ రెడ్డి రూ. 25వేలు సాయం
MLA Komatireddy Rajagopal Reddy : ప్రజా దీవెన, సంస్థాన్ నారాయణ పురం: పెన్షన్ ఇప్పించి ఆడుకోం డoటూ వేడుకున్న అభాగ్యునికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అండగా నిలి చారు. అభాగ్యుని అవసరాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే జై చారి టబుల్ చైర్మన్, చిమిర్యాల మాజీ సర్పంచ్ దోనూరు జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నారాయణపురం మండలం పరిధిలోని సాయిగోని భావి గ్రామానికి చెందిన కొలను యాదిరెడ్డికీ ఆర్ధిక సాయం చేయిం చారు. రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయి మంచం పట్టిన వారి కుటుంబానికి రూ. 25 వేలు ఆర్థిక సహాయంగా అందజేశారు.అలాగే పెన్షన్ నీ కూడా త్వరలో వచ్చేటట్టు చేస్తానని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు.
ఈ కా ర్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు రామ స్వామి,శివానంద రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకుడు మన్నే నరసింహారెడ్డి,ఏనుగు జంగారెడ్డి, సయ్యద్ బాషా తదితరులు పాల్గొ న్నారు.