Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mla Komatireddy rajgopalReddy : అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కు ఎమ్మెల్యే కోమటిరెడ్డి శంకుస్థాపన

అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కు ఎమ్మెల్యే కోమటిరెడ్డి శంకుస్థాపన

ప్రజా దీవెన, నారాయణపూర్: మునుగోడు నియోజకవర్గ నారా యణపురం మండలంలో గడిచిన 40 సంవత్సరాల నిరీక్షణకు తెర పడింది.నారాయణపూర్ మండలం జనగాం గ్రామంలో అంబేద్కర్ భవ న్ ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణా నికి మునుగోడు శాసనస భ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ( mla rajgopalReddy) శంకు స్థాపన చేశారు.

ఇప్పటికే ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా ఆరు లక్ష ల రూపాయలు మంజూరు చేసిన ఎమ్మెల్యే కాలనీవాసులకు ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాల్ (comunityhall) డిజైన్ రూపొందించి ఎస్టి మేషన్ పంపివ్వాలని స్థానిక నాయకులను ఆదేశించారు. కమ్యూని టీ హాలు నిర్మాణాని కి అయ్యే నిధులను ( funds ) కూడా పూర్తిగా మంజూరు చేయిస్తానని హామీ ఇవ్వడంతో కాలనీ వాసులు హర్ష ద్వానాలు వ్యక్తం చేశారు.

అంతకుముందు అంబే ద్కర్ విగ్రహానికి (Ambedkar sta tue) పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ కమ్యూనిటీ హాలు నిర్మాణంతో పాటు అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఆధునీకరణ పనులు (Moderni zation wor ks) కూడా చేయిస్తానని హామీ ఇచ్చారు.

40 సంవత్స రాలుగా ఈ కమ్యూనిటీ హాల్ కో సం నిరీక్షణ (waiti ng) చేస్తున్నా మని మీరు చూపిన చొరవ వల్ల ఇది సాధ్యమైందని స్థానిక కాలనీ వాసులు ఎమ్మెల్యేతో పేర్కొన్నారు. తప్పకుండా ఎటు వంటి సమస్య ఉన్నా కూడా అన్ని పరిష్కరిస్తానని కాలనీవాసులకు హామీ ఇచ్చారు.

Mla Komatireddy rajgopalReddy