–మావోయిస్టులతో చర్చలు జర పాలి
–ఇరు దేశాల మధ్య చర్చలతో హింసకు స్వస్తిపలుకుతున్నప్పుడు తమ దేశ పౌరులతో చర్చలు చేస్తే తప్పేంటి
–తెలుగు బిడ్డలను పిట్టల్లా కాల్చు తుంటే రెండు ప్రభుత్వాలు పట్టిం చుకోవా
–ఆంధోల్ మాజీ ఎం ఎల్ ఏ క్రాంతి కిరణ్
MLA Kranti Kiran : ప్రజా దీవెన, హైదరాబాద్: దండ కారణ్యంలో కొన్ని నెలలుగా సాగు తున్న మారణకాండ ఆగాలంటే చర్చలే పరిష్కారం అని సీనియర్ జర్నలిస్ట్ , ఆంధోల్ మాజీ ఎం ఎల్ ఏ క్రాంతి కిరణ్ అన్నారు. ఆయు ధాలతో సంచరిస్తున్నారనే నెపంతో ఒక వ్యక్తి ప్రాణాలు తీసేహక్కు పో లీస్ బలగాలకు లేదన్నారు. విదేశీ శక్తులు దేశం మీద దాడికి ప్రయ త్నం చేస్తే వారి జాడనునుకనిపెట్టి వారిపై దాడికి ప్రయోగించే డ్రోన్ లను శాటిలైట్ గన్ , రోబో డేగలను మన పొరుల మీదే ఉపయోగిం చడం, దారుణంగా మట్టుబెట్టడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. రెండు నెలల్లోనే వంద ల మంది ఎన్ కౌంటర్ లో చని పోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్ట్ గా 25 ఏళ్ళు పనిచేసిన మాజీ ఎం ఎల్ ఏ క్రాంతి కిరణ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టింగ్ లో, నక్సల్స్ వార్తల సేకరణలో బాగా అనుభవం ఉండి గతంలో నక్సల్స్ తో చర్చల సమయంలో కూడా క్రియాశీలకంగా పనిచేసిన అనుభవంతో మీడియాతో తన అభిప్రాయాలను పంచున్నారు.
అ త్యాధునిక టెక్నాలజీని ఉప యో గించి నక్సల్స్ ని నిర్మూలించేకంటే అదే టెక్నాలజీ ఉపయోగించి దేశం లో పేదరిక నిర్మూలనకు ప్రణాళిక లు రూపొందించాలని అదే టెక్నా లజీ ఉపయోగించి దేశ సంపద దోచుకుంటున్న వారిని, ప్రజలను దోచుకుంటున్న వారిని నిర్మూలిం చాలని అలా చేస్తే భవిష్యత్తు లో నక్సలైట్ల ఉనికి ఉండకపోవచ్చు కదా అని ఆయన అన్నారు. సమస్య మూలాల ను పరిష్కరించే బాద్యతను వదిలి విచక్షణారహి తంగా కాల్పులు జరిపి చనిపో యిన వారి శవాలను ఇలా కుప్ప లుకుప్పలుగా పంపించడం అమా నవీయమని, రాజ్యాంగ విరుద్ధమ ని ఆయన అన్నారు. ఈ మారణ కాండలో వేలాది మంది అమాయక ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతు న్నట్టు వార్తల్లో చూస్తున్నాం అందు కే మావోయిస్టులను చర్చలకు పిల వాలని ఈ నరమేధానికి ముగింపు పలకాలని క్రాంతి కిరణ్ కోరారు. దేశాల మధ్య ఆధిపత్య పోరులో వేలాది మంది చనియేయినప్పటికి ఇజ్రాయిల్ పాలస్తీనా దేశాలు చర్చ ల ద్వారా కాల్పుల విరమణ చేసి హింసకు స్వస్తిపలుకుతున్న పరి స్థితి మన కళ్లముందర కనిపిస్తున్న తరుణంలో తమ దేశ బిడ్డలతో చర్చలు జరపడానికి మన ప్రభు త్వాలు ఎందుకు ముందుకురావ డం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం చొరవ చూపి కాల్పుల విరమణకు కృషి చేయాలని డి మాండ్ చేశారు.