MLA Mallaya Yadav : ప్రజా దీవెన, కోదాడ: కోదాడ మున్సిపల్ పరిధిలోని తమ్మర గ్రామానికి చెందిన సిద్ధెల రాంబాయి మృతి బాధాకరమని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సిద్ధెల రాంబాయి అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. ఈ సందర్భంగా ఆదివారం తమ్మర గ్రామంలోని మృతురాలి నివాసగృహానికి వెళ్లి పార్థివ దేహం పై పూలమాలలు ఉంచి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాంబాయి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతు ని ప్రార్థించినట్లు తెలిపారు. రాంబాయి కుటుంబానికి ఎల్లప్పుడు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దెల వెంకటరమణ శ్రీనివాసరావు, గుండె రాజేష్, బొజ్జ గోపి, ఇమ్రాన్ ఖాన్, మరియు కుటుంబ సభ్యులు కుమారులు సిద్ధెల శ్రీనివాసరావు సరిత, ప్రసాద్ నాగమణి కుమార్తెలు ముత్యాలమ్మ వెంకటేశ్వర్లు , నాగమణి శివయ్య బంధువులు పాల్గొన్నారు.