*ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు రఘు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కు వినతి పత్రం
*సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి…
MLA Padmavathi Reddy: ప్రజా దీవెన, కోదాడ: అర్హత కలిగిన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు (Home sites for journalists) కేటాయించాలని కోరుతూ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా (Electronic media)అధ్యక్షులు పడిశాల రఘు ఆధ్వర్యంలో, ఆదివారం కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి (MLA Padmavathi Reddy) సంతకాలతో కూడిన వినతిపత్రం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు (Journalists)ఎదుర్కొంటున్న సమస్యలను రఘు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. జర్నలిస్టుల చిరకాల స్వప్నం అయినా ఇళ్ల స్థలాలను మంజూరు చేసేలా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరారు. సొంత ఇల్లు లేక అనేక మంది జర్నలిస్టులు, అద్దెలకు ఉంటు అదే చెల్లించలేని దీన పరిస్థితిలో ఉన్నారనిఎమ్మెల్యేకు తెలిపారు.
ఈ విషయంపై ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి (MLA Padmavathi Reddy), సానుకూలంగా స్పందించి త్వరలోనే మీ సమస్య పరిష్కరిస్తా అని హామీ ఇచ్చారు. కోదాడ ఎమ్మెల్యేగా నేను, మంత్రిగా ఉత్తంకుమార్ రెడ్డి కోదాడ మరియు హుజూర్ నగర్ అభివృద్ధి పథంలో తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తున్నామని, తప్పనిసరిగా మీడియా సహకారం కావాలని ఈ సందర్భంగా ఆమె జర్నలిస్టుల ను కోరారు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కోదాడను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేలా తోడ్పాటును అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో. అవుల మల్లికార్జున్, రాము, లక్ష్మణ్, గోపి, గణేష్, శ్రీకాంత్, నాగరాజు, నజీర్, వెంకట్ నారాయణ, గోపాల్, సైదులు, లింగయ్య, మల్లయ్య, నరేష్, సత్యరాజ్, శేఖర్, బసవయ్య, దినేష్ , లక్ష్మీనారాయణ, శ్రీహరి, రామారావు, సునీల్, మహిముద్, బండి శ్రీను ,తదితరులు పాల్గొన్నారు.