Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLA Padmavathi Reddy: అర్హులైన రైతులందరి రుణాలు మాఫీ చేస్తాం.

*రైతులు ప్రత్యామ్నాయ పంటలపై మొగ్గు చూపాలి.
*గత ప్రభుత్వంలో రైతుబంధు పేరిట నిధులు దుర్వినియోగం. మంత్రి తుమ్మల. నాగేశ్వరరావు….
కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి.

MLA Padmavathi Reddy: ప్రజా దీవెన, కోదాడ:రైతులు వరి పంట కంటే ఎక్కువ ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ పంటలు పండించడానికి మొగ్గు చూపాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో (MLA Camp Office)కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి (MLA Padmavathi Reddy) తో కలిసి రైతులతో సమావేశమై మాట్లాడారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా,వరి పంటకు బోనస్ ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించి రైతుల నుండి సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం వారు మాట్లాడుతూ రైతు భరోసా నిధులు నిజంగా పంట పండించే రైతుకు అందాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని గత ప్రభుత్వం చేసిన తప్పులు తమ ప్రభుత్వం చేయదన్నారు. ఇంకా నాలుగు జిల్లాల్లో రైతుల నుండి అభిప్రాయాల సేకరణ జరుగుతుందని ఆ వెంటనే రైతులందరికీ (To all farmers)ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామన్నారు.

మూడో విడత రుణమాఫీ నిధులు ఆగస్టు 15న విడుదల చేస్తామని ఇంకా అర్హత కలిగి రుణమాఫీ కానీ రైతుల జాబితాను సేకరించి తప్పులను సరిచేసి 15 తర్వాత అందరి రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. ఈ సీజన్ నుంచే సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. అదేవిధంగా రైతులు అధిక మోతాదులో యూరియా,పురుగు మందుల వాడకం తగ్గించాలన్నారు. పామాయిల్ తోట సాగు (Cultivation of palm oil plantation) చేసే రైతులకు ప్రభుత్వం నుంచి 55వేల రూపాయలు సబ్సిడీని అందజేస్తున్నామని రైతులందరూ ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో పిసిసి డెలిగేట్ నెంబర్ చింతకుంట్ల. లక్ష్మీనారాయణ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఎర్నేని బాబు,ఆర్డీవో  సూర్యనారాయణ,వ్యవసాయ అధికారి రజిని,ఇర్ల. సీతారాం రెడ్డి,బచ్చు.అశోక్,ముస్తఫా,బాగ్దాద్, శేషు,శమి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నార.