Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLA Padmavathi Reddy: ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి.

*బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం.ఎమ్మెల్యే

MLA Padmavathi Reddy: ప్రజా దీవెన, కోదాడ: భారీ వర్షాల కారణంగా నష్టపోయిన వారిని ప్రభుత్వం అండగా ఉండి ఆదుకుంటుందని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి (MLA Padmavathi Reddy) అన్నారు.మంగళవారం పట్టణంలోని షిరిడి సాయి నగర్, శ్రీరంగపురం ముంపు ప్రాంతాలను అధికారులు, ప్రజా,ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. వర్షంతో దెబ్బతిన్న ఇళ్లను,వాహనాలను పరిశీలించి బాధితులకు ధైర్యం కల్పించారు అనంతరం ఆమె మాట్లాడారు.ఇళ్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు (Indiramma houses) మంజూరు చేస్తామని ఆస్తి నష్టం కలిగిన వారికి అధికారులతో అంచనా వేసి ప్రభుత్వం చేత పరిహారం అందించేందుకు కృషి చేస్తానన్నారు.

ప్రజలు ఎవరు కూడా అధైర్య పడవద్దు అని అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. రోడ్లు ధ్వంసమైన చోట పునరుద్ధరణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.త్వరలోనే 450కోట్ల తో పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. బాధితులు ఎమ్మెల్యే (The victims are MLA) ముందు ప్రజలుతమ గోడు వెళ్ళబోసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.ఈ కార్యక్రమంలో ఆమె వెంట మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల, వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, 18 వ వార్డు కౌన్సిలర్ కర్రి శివ సుబ్బారావు,కమిషనర్ రమాదేవి,కంబాల రంగా, కంబాల ప్రసాద్, చావా హరినాథ్,ఆలేటి రాంబాబు,మట్టపల్లి నాగేశ్వరరావు,నజీర్,వెంకటి, నరసింహ,కోటేశ్వరరావు, సారథి తదితరులు పాల్గొన్నారు.