Padmavathi Reddy: ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కోదాడ శాసన సభ్యురాలు నలమాధ పద్మావతి రెడ్డి (Padmavathi Reddy)అన్నారు సోమవారం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ వైద్యశాల (government hospital)ను ఆమె సందర్శించి మాట్లాడారు. వైద్యశాలకు కావలసిన పరికరాలను వెంటనే అందించేందుకు కృషి చేస్తానని ముఖ్యంగా గర్భిణీ స్త్రీల (Pregnant Women) ను సాధ్యమైనంత వరకు ఆపరేషన్ లేకుండా నార్మల్ డెలివరీ (Normal Delivery) చేయాలని అన్నారు.
వైద్యశాలలో సిబ్బంది కొరత ఉందని త్వరలో వైద్యులకు కొరతను తీర్చి పేద ప్రజలకు వైద్యం అందించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటానని తెలిపారు. ప్రభుత్వ వైద్యశాలలో శానిటేషన్ సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకుని సిబ్బందిని పెంచేందుకు చర్యలు తీసుకొని వైద్యశాలను పరిశుభ్రంగా ఉంచుతామని తెలిపారు కోదాడ ప్రభుత్వ వైద్యశాల 100 పడకల (Hundred Beds) ఆసుపత్రికి అనుమతులు వచ్చాయని త్వరలోనే టెండర్ల ద్వారా వంద పడకల (Hundred Beds) ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలోనే కోదాడ ప్రభుత్వ వైద్యశాలను నెంబర్ వన్ హాస్పటల్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ సూర్యనారాయణ హాస్పటల్ సూపర్డెంట్ దశరథ్ కాంగ్రెస్ డెలిగేట్ నెంబర్ చింతకుంట లక్ష్మీనారాయణ రెడ్డి (Lakshminarayana Reddy) జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు కౌన్సిలర్లు కమదనపు చందర్రావు ఎస్కే షఫీ వైద్యులు నరసింహ పద్మావతి వైష్ణవి సుస్మారెడ్డి మాధురి హెడ్ నర్స్ స్టాఫ్ నర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.