*ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి,ఎమ్మెల్యే.
MLA Padmavathi Reddy: ప్రజా దీవెన, కోదాడ: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి (MLA Padmavathi Reddy) అన్నారు.బుధవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో (camp office) నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 166 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి (kalyana Lakshmi), షాదీ ముబారక్ చెక్కులను (Shadi Mubarak cheques) పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల కోడ్ తో చెక్కుల పంపిణీ కాస్త ఆలస్యం అయిందని లబ్ధిదారులు వీలైనంత తొందరగా చెక్కులను బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ (congress) పార్టీతోనేఅన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని పేదల సంక్షేమానికి ప్రభుత్వం అందించే సాయాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ,మున్సిపల్ చైర్మన్ సామినేని. ప్రమీల,రాష్ట్ర నాయకులు ఎర్నేని. బాబు,ఎంపీపీ మల్లెల. రాణి,చుండూరు. వెంకటేశ్వరరావు, ప్రశాంతి, బొలిశెట్టి. శిరీష, నాగేంద్రబాబు మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.