MLA Padmavathi Reddy:మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో కాస్మోటిక్, మేస్ చా ర్జీలు పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ప్రజా దీవెన, కోదాడ:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహల్లో పెంచిన చార్జీలకు అనుగుణo నూతన మెనూ ను అమలు చేయాలనికోదాడశాసనసభ్యురాలు నలమాద పద్మావతి రెడ్డి అన్నారు శనివారం పట్టణంలోని స్థానిక మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులకు కాస్మోటిక్, మెస్ చార్జీల పెంపు కార్యక్రమాన్ని ప్రారంభిచారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెంచిన డైట్ చార్జీలకు అనుగుణంగా విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం, కాస్మోటిక్ చార్జీలు ఇవ్వాలని కోరారు .గురుకుల పాఠశాలలో చదివే.విద్యార్థులు కష్టపడి చదివి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు స్థానిక వార్డు కౌన్సిలర్ కర్రి శివ సుబ్బారావు కాంగ్రెస్ నాయకులు బాయిజన్, బాగ్దాద్ షమ్మీ, గంధం పాండు మైనారిటీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు