Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLA Padmavathi Reddy: వరద బాధితులకు నిత్యావసరాలు అందజేత..

MLA Padmavathi Reddy: ప్రజా దీవెన, కోదాడ: గతవారం కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు పలు గ్రామాలు ముంపుకు గురయ్యాయి ముఖ్యంగా కోదాడ మండల పరిధిలోని తొగర్రాయి, కూచిపూడి అనంతగిరి మండల పరిధిలోని గోండ్రియాల గ్రామాల్లో వందలాదిమంది నిరాశ్రయులయ్యారు. ముంపు ప్రాంతాల నిరాశ్రయులను ఆదుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి (MLA Padmavathi Reddy) ఇచ్చిన పిలుపుమేరకు పట్టణానికి చెందిన వాసవి క్లబ్ ఆధ్వర్యంలో (Under the aegis of Vasavi Club)బాధితులకు పంచేందుకు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిత్యవసర వస్తువులను అందజేశారు.

బాధితులకు అవసరమయ్యే సబ్బులు పేస్టులు (Soaps are pastes) నూతన వస్త్రాలు బెడ్ షీట్లు ఇతర కిరాణా సామాగ్రిని క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకుడు బాల్ రెడ్డికి అందజేశారు.ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ (Vasavi Club))అధ్యక్ష కార్యదర్శులు వంగవీటి నాగరాజు, చిత్తలూరి భాస్కర్, వంగవీటి లోకేష్, బండారు శ్రీనివాసరావు కోశాధికారి వెంపటి ప్రసాద్, ఐఈసి ఆఫీసర్ వంగవేటి గురుమూర్తి, ఐపీసీ పబ్బా గీతాదేవి, ఐపీసీ గరినే శ్రీనివాసరావు, రీజియన్ చైర్మన్ చల్లా లక్ష్మీనరసయ్య, ఆర్ఈసి బండారు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు గుడుగుంట్ల సాయి, బోనాల సైదారావు, పబ్బా వెంకటేశ్వర్లు, రాయపూడి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.