Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Rajagopal Reddy warning : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్, చెరువులను కబ్జా చేస్తే కబర్దార్ 

Rajagopal Reddy warning :  ప్రజా దీవెన, మునుగోడు: మును గోడు నియోజకవర్గంలో చెరువు ల ను కబ్జా చేస్తే ఊరుకునేది లేదని హె చ్చరించారు మనుగోడు శాసనస భ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చెరువులు నిండుగా ఉంటే జీవజా తులు సంతోషంగా ఉంటాయని జీవజాతులన్నీ ఉన్నచోట జీవై వైవిధ్యం ఉట్టి పడుతుందన్నారు. సోమవారం ఉదయం మునుగోడు పట్టణాన్ని అనుకొని ఉన్న పెద్ద చె రువును మార్నింగ్ వాక్ చేసుకుం టూ పరిశీలించారు.

 

దాదాపు 395 ఎకరాలు ఉన్న ము నుగోడు పెద్ద చెరువు మొత్తం కబ్జా కు గురైందని స్థానిక నాయకులు ఎ మ్మెల్యే దృష్టికి తీసుకురాగ పెద్ద చె రువును, చెరువు కట్టను, అలుగు ను పరిశీలించారు. తహసిల్దారు, సర్వేయర్ స్థానిక ఎంపీడీవోలతో కలిసి కట్ట మీదే రెవెన్యూ మ్యాప్ ను పరిశీలిం చారు. రెవిన్యూ రికా ర్డుల ప్రకారం రెవెన్యూ మ్యాప్ ప్రకా రం చేపట్టాల్సి న పనులను అధికా రులకు సూచించారు.

మొత్తంగా ఎంగేజ్మెంట్ సర్వే నిర్వ హించి చెరువు కబ్జాకు గురైతే ఆ కబ్జా చేసిన వారికి నోటీసులు పం పించి చెరువు బార్డర్స్ ఫిట్ చేయా లన్నారు. చెరువు కట్టను స్ట్రెంతెన్ చేసి వెడల్పు చేయాలన్నారు. చెరు వు లోపలి భాగం వరకు లోతుగా మట్టిని తొలగించి చెరువు నిండుగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నా రు. రాబోయే కాలంలో చెరువులను సుందరీకరణ చేస్తామని నల్గొండ రోడ్డు నుండి నార్కెట్పల్లి రోడ్డు వర కు కట్టమీదగా రోడ్డు వెడల్పు పను లు కూడా చేపడుతామన్నారు.

 

చెరువు ల్యాండ్ తో పాటు ఎఫ్డిఎల్ ల్యాండ్ ఎంత ఉంది అనేది కూడా నివేదిక సమర్పించాలని స్థానిక తాసిల్దార్ కి ఆదేశించారు. ఈ పరి శీలనలో స్థానిక నాయకులతో పాటు మునుగోడు ఇన్చార్జి తహ సిల్దార్ నరేష్, మునుగోడు ఇన్చార్జి ఎంపీడీవో విజయభాస్కర్, నీటిపా రుదల శాఖ డిఈ ప్రేమ్ కుమార్, సర్వేయర్ నాగేశ్వరరావు తదితరు లు పాల్గొన్నారు.