MLA samel : ప్రజా దీవెన, శాలిగౌరారం: రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభు త్వం నిరంతరం కృషి చేస్తుందని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు అన్నారు. ఈ సందర్భంగా గురువారం కట్టంగూరు మండలం ఐటిపాముల నుండి శాలిగౌరారం మండలంలోని వల్లాల ,పెర్క్ కొండరాం వరకు లిఫ్ట్ ఇరిగేషన్ ను 100 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న పైపులైను ను వల్లాల గ్రామ శివారులో పరిశీలించారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ తో వల్లాల గ్రామంలో 1529 ఎకరాలు,పెర్క కొండారంలో 800 ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు.కాలువల ద్వారా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తున్నట్లు తెలిపారు.నాలుగు, ఐదు నెలలు ఈ పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
వీటితో పాటు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుతో కాలువల ద్వారా అమ్మనబోలు,ఎన్.జి కొత్తపల్లి నుండి శాలిగౌరారం ప్రాజెక్టులోకి కూడా నీరు తీసుకురావాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఉమ్మడి జిల్లాలో ఎక్కడలేని విధంగా ప్రాజెక్టు ద్వారా కాల్వలతో నీరు వ్యవసాయ భూములకు అందిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో లిఫ్ట్ ఇరిగేషన్ ఈ ఈ శ్రీనివాస్ రెడ్డి, డీఈ శ్రీనివాస్, ఎఇ రాజశేఖర్ రెడ్డి, శాలిగౌరారం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సమరం రెడ్డి, మార్కెట్ చైర్మన్ పాదూరి శంకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఎస్.కె ఇంతియాజ్, భూపతి మంగమ్మ వెంకన్న, బొమ్మగాని రవి,వేముల గోపీనాథ్, గుండ్లపల్లి సైదులు, తోటకూరి పరుశరాములు, దేవరకొండ జయరాజ్,లింగయ్య, ఐలయ్య, మంగదుడ్ల శ్రీనివాస్,మాధగోని అంజయ్య, లోకసాని రంగారెడ్డి, నూక కిషోర్ తదితరులు పాల్గొన్నారు.