–షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
MLA Veerlapalli Shankar: ప్రజా దీవెన, షాద్ నగర్: తెలంగాణ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల పాలసీ (Telangana Micro, Small and Medium Enterprises Policy)-2024లో వెనుకబడిన వర్గాల (బిసి) వారికి సముచిత స్థానం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ (MLA Veerlapalli Shankar)రా ష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ ప్రభుత్వం సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల ను ప్రోత్సహించడానికి నూతన ఎంఎస్ఎంఇ పాలసీ -2024 విధా నాన్ని రూపొందించడం పట్ల ఇట్టి పాలసీలో వెనుకబడిన తరగతుల వర్గాలకు అనుగుణంగా తగు మా ర్పులు, సలహాలు, సూచనలు చేయుటకు బీసీ సంక్షేమ శాఖ మం త్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశానికి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు.
ఈ పాలసీ (policy) యొక్క సవరణతో బిసి వర్గానికి చెందిన మహిళలు, పారి శ్రామికవేత్తలు, నిరుద్యోగ యువతీ యువకులకు ప్రయోజనం చేకూరే విధంగా చైర్మన్ వీర్లపల్లి శంకర్ పలు సూచనలు చేశారు. వడ్డెర కులస్తులకు ఆర్థిక స్వావలంబన కల్పనలో భాగంగా క్యారీలు కేటా యించాలి కోరారు.క్వారీలు కేటాయిస్తే (If quarries are allocated) అనాదిగా వస్తున్న కుల వృ త్తిని ప్రోత్సహించడంలో భాగంగా వారికి ప్రభుత్వం ఆర్థికంగా చేయు త ఇచ్చినట్లు అవుతుందని తెలిపా రు.బార్బర్ కమ్యూనిటీ వారిని ప్రభుత్వం ఆదుకోవాలని అలాగే కార్పొరేట్ సంస్థలు బార్బర్ షాప్ లను కార్పొరేట్ స్థాయిలో (corporate level)ఏర్పాటు చేసి ఈ కుల వృత్తిని నమ్మి జీవి స్తున్న వారిని మోసం చేస్తున్నాయి అని పేర్కొన్నారు. కావున ఒక రె గ్యులేటరీ అథారిటీ నీ ఏర్పాటు చేసి ఆ కార్పొరేట్ సంస్థలను ని యంత్రించాలని కోరారు.కుమ్మరి కులస్తులకు వారి గ్రామ పరిధిలో ఉన్న చెరువుల్లో ఎలాంటి షరతు లు లేకుండా ఒండ్రు మట్టిని తరలిం చుటకు తగు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.సమాజంలో అందరూ శుభ్రంగా ఉండేందుకు తోడ్పడే చాకలి కులస్తులకు మారుతున్న కాలానుగుణంగా అత్యాధునిక మోడ్రన్ దోబి ఘాట్ లను ఏర్పాటు చేయుటకు ఆర్థిక సహకారం తో పాటు ఇతర వసతులు కల్పించాలి కోరారు. నూతన ఎంఎస్ఎంఇ పాలసీ -2024 లో నూతన పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేస్తే బీసీ (bc)లకు కూడా సముచిత కేటాయింపులు చేయాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో మాజీ రాజ్య సభ సభ్యులు కె.కేశవ రావు , వెనుకబడిన తరగతుల శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్ర వెంక టేశం,రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి తదితరులు పాల్గొన్నారు.