MLA Vemula Veeresham : ప్రజా దీవెన, శాలిగౌరారం: శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలో ఎంతో విశిష్టత కలిగిన సూర్య దేవాలయం లో దేవాలయ పరిరక్షణ కమిటీ, దాతల ఆధ్వర్యంలో రథ సప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయంలో సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలతో పాటు హోమం, అభిషేకాలు వేద మంత్రాలతో కన్నుల పండుగగా నిర్వహించారు.
అనంతరం భక్తులకు అన్నప్రసాదం చేశారు.ఈ కార్యక్రమాలకు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి పుష్ప, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కందాల సమరం రెడ్డి-మంజుల దంపతులు,మాజీ ఎంపిటిసి వలిశెట్టి ఇందిర-సైదులు,వల్లాల మాజీ సర్పంచ్ షేక్ ఇంతియాజ్ అహ్మద్, గ్రామ పురోహితులు వావిలాల రామలింగయ్య శర్మ, గ్రామ పెద్దలు, సూర్య దేవాలయ పరిరక్షణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.