ప్రజా దీవెన నకిరేకల్: తెలంగాణ రైతాంగానికి సంక్రాంతి పర్వదినం లోపు రైతు భరోసా నూటికి నూరుపాళ్లు వేస్తామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పునరు ద్ఘాటించారు. సోమవారం నకిరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నకిరేకల్ మండ లానికి సంబంధించిన 83 మందికి మంజూరైన కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రోజు 83 మంది కి కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. గత బి ఆర్ ఎస్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 7 లక్షల కోట్ల అప్పు లు చేసిన ఘనత గత బిఆర్ఎస్ ప్రభుత్వానిదని ఆరోపించారు. ఔట ర్ రింగ్ రోడ్డు ను 30 సంవత్సరాల కు అమ్మేసి డబ్బులు దోచుకున్నా రని విమర్శించారు.
కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణలో పది యేండ్లు అధికా రంలో ఉండి ఇంటికో ఉద్యోగం అని ఏ ఉద్యోగం ఇవ్వలేదని దుయ్య బట్టారు. ముఖ్యమంత్రి మహిళల కు బస్సు ఉచిత ప్రయాణం కల్పి స్తూ గ్యాస్ సిలిండర్, మీద రాయ తీ ఇస్తూ 200 యూనిట్ల వరకు కరెంట్ ఉచితంగా ఇస్తున్నామని వివరించారు. ఈ రెసింగ్ అనే కారు రెసింగ్ పెట్టి కెటిఆర్ 55 కోట్ల రూ పాయల ప్రభుత్వ సోమును దోచు కున్నాడని ఆరోపించారు. 20 లక్షల ఎకరాలను పార్ట్ బి లో పెట్టి రైతు లను ఇబ్బందులు పెట్టారని, ఇప్పు డు ధరణి పోయి భూమాత వచ్చిం దని, దీనితో రైతుల కష్టాలు తీర నున్నాయని, ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి ఆలోచించి ప్రతీ నియోజక వర్గంలో 30 ఏకారాల్లో రూ. 200 కోట్లు పెట్టి ఓకే చోట గురుకుల పాఠ శాలలు నిర్మాణం చేపడుతున్నార ని చెప్పారు.
గతంలో కల్యాణ లక్ష్మీ సంతకం కోసం ఆ నాయకుడి వద్ద కు వెళితేనే తిప్పి తిప్పి సంతకం పెట్టేది ఎమ్మెల్యే అంటే ప్రజలకు అందుబాటులో ఉండేలా ఉండి చూపిస్తున్నామని చెప్పారు. ఇప్పు డా అవసరం మీకు లేకుండా మీ మండలం ఎంఆర్ఓ ఆఫిస్ లో మీ దరఖాస్తు ఇచ్చే సౌకర్యం కల్పించి నమని గుర్తు చేశారు. ఈ కార్య క్రమంలో స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత – శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల-మాధవ్ రెడ్డి, పి ఎ సీ ఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటే శ్వర్లు, స్థానిక కౌన్సిలర్లు, అధికా రులు, ఆయా గ్రామాల ప్రజాప్రతి నిధులు తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
