Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLA Vemula Veeresham: ఏడాదిలోనే సమగ్రాభివృద్ధి సాధించాం

–రూ.1238 కోట్లతో అభివృద్ధి ఇప్పటికే పథకాలు ప్రారంభం
–విలేకరుల సమావేశంలో మాట్లా డుతున్న ఎమ్మెల్యే వేముల వీరేశం

ప్రజా దీవెన, నకిరేకల్ : గత ఏడాదిలో నకిరేకల్ నియోజక వర్గంలో రూ.1238కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశామని నకి రేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలి పారు. రాష్ట్రంలో ప్రజాపాలన ఏడాదిపూర్తి చేసుకున్న నేపథ్యంలో డీసీఎంఎస్ చైర్మన్ బోళ్ళ వెంక టరెడ్డి, నకిరేకల్ మార్కెట్ చైర్ పర్సన్ గుత్తా మంజుల మాధ వరెడ్డి, మునిసిపల్ చైర్పర్సన్ రజితలతో కలిసి నల్లగొండ జిల్లా నకిరేకల్ లో మంగళవారం మీడి యాతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. గత ప్రభుత్వం చేపట్టి వదిలేసిన పనులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ప్రజాపా లనలో కొత్త అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం గడీల పాలన సాగిస్తూ రూ.7 లక్షలకోట్ల అప్పులు చేసిందని విమ ర్శించారు.

నీటిపారుదల ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధ నాన్ని బీఆర్ఎస్ కొల్లగొట్టిందన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలల ప్రాజెక్టుగా ఉన్న బ్రాహ్మణ వెల్లెంలకు రూ.500ల కోట్లు ఖర్చు చేస్తే పూర్త య్యేదని, ప్రాజెక్టు పూర్తి చేస్తే నాటి ఎంపీగా ఉన్న కోమటి రెడ్డి వెంకటరెడ్డికి పేరు వస్తుందని దానిని బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు మూలకు పడేసిం దన్నారు. రూ.2వేల కోట్ల ఖర్చులతో పూర్త య్యే ఎస్ఎల్బీసీ సొరంగం పను లనూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. పిల్లాయి పల్లి, ధర్మారెడ్డి కాల్వలను సైతం నాటి ప్రభుత్వం పట్టించు కోలేదన్నారు. రాష్ట్రంలో ప్రజాపా లన ప్రారంభమైన తొలి ఏడాదిలోనే బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టుకు రూ.30 కోట్లు, ధర్మారెడ్డికాల్వకు రూ.12 9కోట్లు, పిల్లాయిపల్లి కాల్వకు రూ.90కోట్లు మంజూరు చేసిందని చెప్పారు.

రూ.103కోట్ల వ్యయంతో నియోజ కవర్గ వ్యాప్తిగా ఆర్అండ్ బీ రోడ్లు, రూ.53కోట్లతో పంచాయి తీరాజ్ రోడ్లు నిర్మించామన్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలా ల్లో రూ.368కోట్ల రైతుల రుణమా ఫీ జరిగిందన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సభ్యు డు చామల శ్రీనివాస్, మార్కెట్ డైరెక్టర్లు ఎస్కే. లతీఫ్, బయ్య ముత్తయ్య, పి. శంభయ్య, కోమటిరెడ్డి చిన వెంకటరెడ్డి, కోట మల్లికార్జునరావు పాల్గొన్నారు.