Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mlakomatireddyrajgopalreddy : మునుగోడు విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం

 

Mlakomatireddyrajgopalreddy: ప్రజా దీవెన, హైదరా బాద్: మును గోడు నియోజకవర్గ కరెంటు సమ స్యల పరిష్కారం, విద్యుత్ పనుల అభివృద్ధి కోసం మునుగోడు ని యోజకవర్గ నాయ కులతో కలిసి హైదరాబాదులోని టిజిసీపీడీసీఎల్ రాష్ట్ర కార్యాల యం లో సిఎండి ముషారఫ్ తో మునుగోడు ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స మీక్ష సమావేశం నిర్వహించారు.

మునుగోడు నియోజకవర్గ వ్యాప్తం గా నెలకొన్న కరెంటు సమస్యలు వి ద్యుత్ పనుల అభివృద్ధిపై మును గోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉ న్న ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్నారు. సమావేశంలో ము నుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న లో వోల్టేజి సమస్య, అదన పు ట్రాన్స్ఫార్మర్ల కేటాయింపు, అదన పు సబ్ స్టేషన్ ల నిర్మాణం, లూజు లైన్ల సమస్యలు, గృహాలు ప్రభుత్వ కార్యాలయాలు పాఠశా లల పైన ప్ర మాదకరంగా ఉన్న కరెంటు వైర్లు తొలగింపు సమస్య లతో పాటు మ రికొన్ని సమస్యలను సీఎండి ము షారఫ్, యాదాద్రి నల్గొండ జిల్లాల కు సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకువచ్చా రు.

ముఖ్య నా యకులు చెప్పిన సమస్యలను సావధానంగా విన్న సిఎండి ము షారఫ్ సమస్యలను వెంటనే పరి ష్కరించాలని అక్కడే ఉన్న యాదా ద్రి నల్గొండ జిల్లాల విద్యుత్ అధికా రులను ఆదేశిం చారు.నాణ్యమైన, భద్రతతో కూడిన కరెంటు ఇచ్చే విధంగా రాబోయే కాలంలో ప్రజా ప్రభుత్వం విద్యుత్ శాఖలో సమూలమైన సంస్కరణ లు తీసుకొస్తుందని, ఆ సంస్కర ణలు మొదట మునుగోడు నియో జకవర్గం నుండి మొదలుపెట్టాలని, మునుగోడు నియోజకవర్గాన్ని పైలె ట్ ప్రాజెక్టుగా తీసుకొని విద్యుత్ అ భివృద్ధి పనులు చేయాలని సిఎండి ముషారఫ్ ని కోరారు.

మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొని ఉన్న కరెంటు స మ స్యలు పరిష్కరించడానికి 34 కోట్ల రూపాయల అవసరమవుతు న్నాయని, ప్రత్యేక దృష్టితో 34 కోట్ల రూపాయల పనులను మంజూ రు చేయాలని ముఖ్య నాయకులతో కలిసి సీఎండి ముషారఫ్ కి వి నతి పత్రం అందజే శారు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.

విద్యుత్ శాఖలో పనిచేసే అధి కా రులు విధుల విషయంలో నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వేధిం చి ప్రజల నుండి డబ్బులు వసూ లు చేస్తున్న విషయాలు నా దృష్టికి వ చ్చాయని దీనివల్ల ప్రజాప్రతి నిధు లుగా మాకు , ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. దయచే సి ఎవరైతే అవినీతి పాల్పడుతు న్నారో వారి పైన కఠిన చర్యలు తీసుకోని స్ట్రీమ్ లైన్ చేయాలని సీఎండి ముషారఫ్ ని కోరారు.

మునుగోడు పైన ప్రత్యేక దృష్టి ఉం టుందని, వ్యవసాయ పొలాల మ ధ్యన ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ వెంటనే మార్పిస్తామని, ట్రాన్స్ఫార్మర్ల ఎత్తు పెంచాల్సిన అవసరం ఉందన్నారు సిఎండి ముషారఫ్. అగ్రి కల్చర్ డి పిఆర్లకు ఏబి స్విచ్లు మొత్తం పెం చుతామని, మే నుండి జూన్ మ ధ్యలో ఏబీ స్విచ్లు మొత్తం రిపేర్ చేయాలని అక్కడే ఉన్న అధికారు లను ఆదేశించారు.

మునుగోడుపై ప్రత్యేక దృష్టి సారి స్తామని చెప్పిన సిఎండి ముషార ఫ్ కి మునుగోడు నియోజకవర్గ ప్ర జల తరఫున ప్రత్యేక ధన్యవా దా లు తెలిపారు. ఈ సమావేశంలో న ల్గొండ యాదా ద్రి జిల్లాల విద్యు త్ అధికారులు, ని యోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.