Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLC Gorati Venkanna : చెంచులను చెరదీయాలి

–పులులు, చెంచులను వేర్వేరుగా చూడొద్దు

–యుగ యుగాలుగా విషాదాన్ని గుండెల్లో మోస్తున్నారు

–శాసన మండలి సభ్యుడు గోరటి వెంకన్న

MLC Gorati Venkanna : ప్రజా దీవెన, హైదరాబాద్: అడవి, చెంచులు వేర్వేరు కాదని, నల్లమల అడవి వారి ఆవాస మని, తల్లి తా వు నుంచి గిరిజనులను వేరు చే యవద్దని ప్రజాకవి, ఎమ్మెల్సీ గోర టి వెంకన్న పాలకులను కోరారు. వేల ఏండ్లుగా అడవిలోనే నివసి స్తున్న చెంచులు వాటిని కాపాడు కున్నారే తప్ప, ఏనాడూ దాన్ని నాశనం చేయలేదని స్పష్టంచేశారు. చెంచులకు, జంతులకు మధ్య మానవాతీత అనుబంధం ఉందని, అది ఈనాటిది కాదని ఆయన ఉద్ఘాటించారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం కుమ్మె నపెంటలో గురువారం ఆయన చెంచులతో మమేకమయ్యారు.

 

 

125 శతాబ్దంలో జరిగిన పల్నాటి యుద్ధం నేపథ్యంలో చెంచు గిరి జన మానవ జీవిత పార్శ్వాన్ని తడు ముతూ సీనియర్ పాత్రికే యుడు వర్ధిల్లి వెంకటేశ్వర్లు ‘కారు కోడి’ నవలరాస్తున్నారు. ఈ నవ లకు కావాల్సిన కథా వస్తువులు సేకరించడానికి ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ‘నమస్తే తెలంగాణ’ అసోసియేట్ ఎడిటర్ రఘురా ములు, జర్నలిస్టు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారు తీసాగర్ గైడ్గా వెళ్లారు. మూడు రోజుల పాటు కుమ్మెనపెంట, చిగు ర్ల పాడు, కొల్లంపెంటలో తిరిగి చెం చుల భాషా, సంస్కృతి, జీవన విధానంపై సమాచారం సేకరిం చారు. టీయూడబ్ల్యూజే జాతీయ నాయకుడు భాస్కర్, రాష్ట్ర నాయ కుడు చందు నాయక్, మాజీ జడ్పీ టీసీ ఇంద్రయ్య సాగర్, రంజిత్, రమేశ్, మహేశ్ ఆంజనేయులు సా గర్, మధు సాగర్, కిరణ్ పాల్గొ న్నారు.