MLC Jeevan Reddy: ప్రజా దీవెన, జగిత్యాల: జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ లో కాంగ్రెస్ సీనియ ర్ నాయకుడు,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) ప్రధాన అనుచరుడు మరు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.గ్రామంలో రాజీకియ కక్షలే హత్య కి ప్రధాన కారణమని తెలుస్తుంది. తమ్మునిలాంటి వాడిని కోల్పోయానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జగిత్యాల- ధర్మపురి (Jagityala- Dharmapuri) ప్రధాన రహదారిపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బైఠాయించి ఆందోళన చేపట్టాయి.జగిత్యాల లో బిఆర్ఎ స్ రాజ్యము నడుస్తుందా కాంగ్రెస్ రాజ్యం నడుస్తుందాని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోలీస్ ల పై మండి పడ్డారు. కాంగ్రెస్ రాజ్యంలో (Congress kingdom) కాంగ్రెస్ నాయకులకే రక్షణ కరువైందని జీవన్ రెడ్డి ఆరోపించారు.పక్క ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్టు ఆరోపించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల లో బి ఆర్ ఎస్ రాజ్య మా కాంగ్రెస్ రాజ్యమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.