–బిడ్డ జైలులో ఉంటే కన్నతండ్రిగా బాధ ఉండదా
–ఎక్కడో ఉన్నోళ్లకు పదవులిచ్చి ఇప్పుడు చేరదీస్తే ఇప్పుడు పార్టీ వీడుతున్నారు
–బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్
MLC Kavitha:ప్రజా దీవెన, హైదరాబాద్: రాజకీ య కక్షతోనే ఎమ్మెల్సీ కవితను (Kavitha)జైల్లో పెట్టారని బీఆర్‌ఎస్ (brs) అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానిం చారు. అన్నింటినీ భరిస్తూ ప్రస్తుతం తానో అగ్ని పర్వతం మాదిరిగా ఉ న్నానని, సొంతబిడ్డ జైల్లో ఉంటే కన్నతండ్రిగా బాధ ఉండదా అని పా ర్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల (MLAs and MLCs)ఎదుట అసహజంగానే ఆయన తీవ్ర భావో ద్వేగానికి గురయ్యారని అసెంబ్లీ బ డ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుస రించాల్సిన వ్యూహంపై చర్చించేం దుకు మంగళవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ఎల్పీ సమా వేశాన్ని నిర్వహించారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో అరెస్టయి తిహాడ్ జైల్లో ఉన్న ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత విషయంలో ఇప్పటిదాకా కేసీఆర్ నేరుగా స్పం దించలేదు.
అయితే బీఆర్‌ఎస్‌ఎల్పీ (BRSLP) సమావేశంలో ఆయన కవిత అరెస్టు పై తొలిసారిగా స్పందించడమే కా కుండా భావోద్వేగానికి గురైనట్లు తెలిసింది. ఉద్యమపార్టీగా బీఆర్‌ఎ స్ అవతరించిన సమయంలో ఎదు ర్కొన్న ఇబ్బందులతో పోల్చుకుంటే పార్టీకి ఇప్పుడంత క్లిష్ట పరిస్థితులు లేవని, ఇంతకంటే ఇబ్బందికర పరి స్థితులు ఉన్న రోజుల్లోనే తెలంగా ణను సాధించామని కేసీఆర్ బీఆర్ ఎస్‌ఎల్పీ సమావేశంలో పేర్కొన్నా రు. ఎక్కడో ఉన్న వాళ్లను తెచ్చి.. వారికి రాజకీయ పదవులు దక్కేలా చేస్తే వారేమో పార్టీని వీడుతున్నార ని, వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొ న్నారు. విపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మె ల్యేగా బాగా ఎదుగుతారనే విష యాన్ని గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఉద్బోధించి నట్లు తెలిసింది. కాగా పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టు సాధించలే కపోయిందని, శాంతి భద్రతలు అదుపు తప్పాయని కేసీఆర్ (kcr) పేర్కొన్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అయిపోయిందని, ఇక ప్రజా క్షేత్రం లోకి వెళ్లి నిలదీద్దామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతలకు కేసీఆర్ పిలు పునిచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా అసెంబ్లీ బడ్జెట్ సమావే శాల నేపథ్యంలో బడ్జెట్ ప్రకటించే రోజు, ఆ తర్వాత సభకు కేసీఆర్ హాజరు కానున్నారు. కాగా ఈ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్సీ లు హాజరు కాలేదు. బీఆర్‌ఎస్ (brs) ఎమ్మెల్యేల్లో ఇప్పటికే పలువురు కాంగ్రెస్‌లో చేరడంతో ఈ పరిణా మం గులాబీ శ్రేణులను కలవరపా టుకు గురిచేస్తోంది. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఈ సమావేశానికి డుమ్మాకొట్టారు. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కూడా హాజరుకాలేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారిని ఏకగ్రీ వంగా ఎన్నుకొన్నట్లు హరీశ్‌రావు (harish rao) తెలిపారు.