Shankar Naik MLC : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రజా ప్రభు త్వంలో రేషన్ కార్డుల పంపిణీ నిరం తర ప్రక్రియ అని శాసనమండలి స భ్యులు శంకర్ నాయక్ అన్నారు. శనివారం ఆయన నల్గొండ ఆర్డీవో కార్యాల యంలో నల్గొండ నియోజ కవర్గ పరిధిలోని లబ్ధిదారులకు నూ తన రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మా ట్లాడారు.
గత ప్రభుత్వం గడిచిన 10 సంవ త్సరాలలో ఒక్క రేషన్ కార్డు మం జూరు చేయలేదని, అలాంటిది త మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తర్వాత నూతన రేషన్ కార్డుల ను ఇస్తున్నదని తెలిపారు. తమ ప్ర భుత్వం పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. రేష న్ కార్డులు రానివారు అధైర్య పడా ల్సిన అవసరం లేదని, ఇది నిరంత రం కొనసాగే ప్రక్రియ అని చెప్పారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీని వాస్ మాట్లాడుతూ దేశంలో మొట్ట మొదటి సారిగా సన్నబియ్యాన్ని పంపిణీ చేసిన రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. సన్న బియ్యం దు ర్వినియోగం కాకుండా సద్వినియో గం చేసుకోవాలని కోరారు. రేషన్ కార్డులు రాని వారందరూ రేషన్ కా ర్డుల కోసం దరఖాస్తు చేసుకోవాల ని, ఇది నిరంతరం కొనసాగుతుంద ని, అందువల్ల ఎవరు ఇబ్బంది ప డాల్సిన అవసరం లేదని తెలిపారు.
కాగా నల్గొండ నియోజకవర్గంలో శ నివారం వరకు10,001 కొత్త రేషన్ కార్డులను ఇవ్వడం జరిగింది. అం తేకాక 12733 మందిని రేషన్ కార్డు లలో నమోదు చేయడం జరిగింది. కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ పథ కం కింద 204 మందికి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వనమహోత్సవం కింద ఎమ్మెల్సీ, రెవెన్యూ అదనపు కలెక్టర్, ఆర్డీవో, సిబ్బందితో సహా ఆర్ డి ఓ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం లో నల్గొండ ఆర్డీవో వై.అశోక్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూడి రమేష్, డిసిసి డైరెక్టర్ సంపత్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారు లు తదితరులు పాల్గొన్నారు.