MLC : ప్రజా దీవెన హైదరాబాద్: ఎమ్మె ల్సీగా సిపిఐ కి అవకాశం వస్తే ఆ ఎమ్మెల్సీ అవకాశం బీసీలకే ఇవ్వా లని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సిపిఐ జాతీయ,రాష్ట్ర నాయకత్వాలకు విజ్ఞప్తి చేశారు.ఈ సంధర్బంగా జాజుల మాట్లాడుతు కమ్యూనిస్ట్ పార్టీలో బడుగు బలహీ న వర్గాలకు చెందిన వారు వాళ్ళ భుజాలు కాయలు కాసేలా జండాలు మోసారని, ఎంతో మంది కేసుల పాలైరాని త్యాగాలు బీసీలవి, భోగాలు అగ్రకులాల వారివి అని అన్నారు.
గత ఎమ్మెల్యే ఎన్నికలలో పొత్తులో భాగంగా ఇచ్చిన ఒక సీటును అగ్రకులాల వారి దక్కించుకున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూడా వారే ఉన్నారని,50 శాతానికి పైగా ఉన్న బీసీలకు సిపిఐ గౌరవించి గౌరవప్రదంగా ఆ యొక్క ఎమ్మెల్సీ సీటును మొదటి నుంచి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఒక బీసీ బిడ్డకు ఇచ్చి సిపిఐ పార్టీ సామాజిక న్యాయం పాటించాలని లింగంగౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి యువజన పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు బూర శ్రీనివాస్, బీసీ విద్యార్థి సంఘం ఓయు ఇన్చార్జి రవీందర్ పాల్గొన్నారు.