— ఎమ్మెల్సీ శంకర్ నాయక్
–కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం
MLC Shankar Nayak :ప్రజాదీవెన నల్గొండ :నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడి అక్రమంగా ఏఐసిసి అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పై చార్జ్ షీట్ నమోదు చేయడానికి నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ లోని క్లాక్ టవర్ సెంటర్ లో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈడి, మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈకార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి ఈడి ఎఐసిసి అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక ఇలాంటి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్, పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని
పార్టీని బలహీనపరచడానికి బిజెపి కుట్రలు చేస్తుందని ఆరోపించారు.కేంద్రంలో బిజెపి అరాచక పాలన సాగిస్తుందని ధ్వజమెత్తారు.
బిజెపి ప్రభుత్వంలో దేశ సంపదంత సంపన్నులు దోచుకుంటున్నారని, దేశంలో కుల గణన చేసి వారికి రావలసిన వాటా కోసం రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని అన్నారు.
దీనిని జీర్ణించుకోలేక కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఈడిని అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తుందని పేర్కొన్నారు.
ముందు దేశ సంపదను దోచుకుంటున్న బిజెపి నాయకులు, సంపన్నులకు కొమ్ముకాస్తున్న వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
ఎన్ని కుట్రలు పన్నిన రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ అన్ని వర్గాల పేద ప్రజల హక్కుల కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలులతో ముందుకు వేలుతుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని తెలిపారు.ఈ ఐదు సంవత్సరాలే కాకుండా మళ్లీ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని అన్నారు. రాబోయే రోజుల్లో బిజెపి ప్రభుత్వం పతనం అవుతుందని, దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ తో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.