Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MlcElectionsresult : ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుచిందెవరో ఎరుకేనా..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుచిందెవరో ఎరుకేనా..

MlcElectionsresult:  ప్రజా దీవెన, నల్లగొండ బ్యూరో: తెలం గాణ ఎ మ్మెల్సీ ఎన్నికల్లో ఎవ రెవరు గెలుచారో ఎవరికైనా ఎరు కెనా అని కోడై కూస్తోంది సోషల్ మీడియా. అయితే తెలంగాణలోని రెండు స్థానాల ఫలితాలు అధికారికంగా వెలువడ్డాయి. కరీంనగర్ ఉపాధ్యా య ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొము రయ్య విజ యం సాధించగా ఇక నల్లొండ జిల్లా ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు. ముందుగానే అం దరూ అనుకున్నట్లే తెలంగాణలోని కరీంనగర్ ఉపాధ్యా య ఎమ్మె ల్సీగా మల్క కొముర య్య విజయం సాధించగా ఇక నల్గొండ ఉపా ధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు లో ఫలితం తేలకపోవడంతో ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఈ గెలుపు ఆయన సొంత మైంది. అలాగే వరంగల్ ఉపాధ్యాయ ఎ మ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. మార్చి 27వ తేదీ న తెలంగాణలోని మూడు ఎమ్మె ల్సీలకు ఎన్నికలు జరిగాయి.వాటికి సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ మార్చి 3వ తేదీ ఉదయం ప్రారంభ మైంది. వాటిలో ఒకటి వరంగల్, ఖ మ్మం, నల్గొండకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఇక 2 ఆది లాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థా నానికి అదే విధంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ గ్రాడ్యుయేట్ స్థానానికి సంబంధిం చిన ఎమ్మెల్సీ కౌంటింగ్ ఈ రోజు జరుగుతోంది.

వీటిలో రెండు స్థానాల ఫలితాలు తేలిపోయాయి. వాటి విజేతలు ఎవరో స్పష్టత వ చ్చేసింది. ఇంకా అధికారికంగా ప్రక టించాల్సి ఉం ది. అలాగే కౌంటింగ్ సైతం కొనసాగుతోంది. అందులో ప్రధానంగా ఆదిలాబాద్, నిజామా బాద్, కరీంనగర్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ స్థానంలో తొలి సారి బీజేపీ బోణి కొట్టింది. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలు పొందారు. కొమురయ్యకు 12,959 ఓట్లు పోలై య్యాయి. ఇక 12081 ఓట్ల మ్యాజిక్ ఫిగర్‌ను కొముర య్య అవ లీలగా దాటారు.ఇక ఈ ఎన్నికల బరిలో నిలిచిన వంగ మ హేందర్ రెడ్డికి 7182, అశోక్ కుమా ర్‌కు 2621, కూర రఘోత్తంరెడ్డికి 4 28 ఓట్లు పోలైయ్యాయి.

ఇక నల్గొం డ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆ ర్‌టీయూ అభ్యర్థి శ్రీపా లరెడ్డి విజ యాన్ని అందుకొన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు. ఆయన 11, 800 ఈ మ్యాజిక్ ఫిగర్‌ను దాటేశారు.


అధ్యక్ష అనే అవకాశం శ్రీపాల్ రెడ్డి కే… ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిఆర్టి యు అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి 13969 ఓట్లు సాధించి శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు. అయితే వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పింగళి శ్రీపాల్ రెడ్డి 13969 ఓట్లు పొంది గెలుపొందారు.11821 ఓట్లమ్యాజిక్ ఫిగర్ ను దాటి ఓట్లు రావడంతో శ్రీపాల్ రెడ్డి విజయం సాధించినట్లు ఆర్వో, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రకటించారు. ఆయనకు సర్టిఫికెట్ ను అందజేశారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో మొత్తం 23,461 ఓట్లు పోలవ్వగా గెలుపొందే అభ్యర్థికి కనీసం 11821 ఓట్లు రావాల్సి ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో అభ్యర్థి గెలుపు నిర్ధారణ కాకపోవడంతో అధి కారులు రెండో ప్రాధాన్యత ఓట్లను చేపట్టారు. ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు నిలబడగా అధికారులు ఒక్కొక్క అభ్యర్థికి నమో దైన ఓట్లను ప్రకారం వరుసగా ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టారు. 17 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయ్యేసరికి పిఆర్టి యు అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి, టి యుటిఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సి రెడ్డి లు చివరి వరకు కొనసాగారు.

పిఆర్టియు అభ్యర్థి శ్రీపాల్ రెడ్డికి 13969 ఓట్లు పొంది విజయం సా ధించగా ప్రత్యర్థి అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డికి 8448 ఓట్లు వచ్చా యి. కాగా తుది ఫలిత వెలువడక ముందే యుటిఎఫ్ అభ్యర్థి అలు గుబెల్లి నర్సిరెడ్డి ఓటమిని అంగీకరిస్తూ కౌంటింగ్ కేంద్రం నుండి బ యటకు వెళ్లిపోయారు. దీంతో శ్రీపాల్ రెడ్డి విజయం సాధించినట్లు పిఆర్టియు శ్రేణులు సంబరాలు నిర్వహించాయి.

ఈ విజయం వారిదే: ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ….ఈ విజయం ఉపాధ్యాయులు ఆధ్యాపకుల ఆత్మగౌరవమని ఉపాధ్యాయ ఎమ్మె ల్సీగా గెలుపొందిన శ్రీపాల్ రెడ్డి చెప్పారు. ఇది ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఇచ్చిన తీర్పు అని తెలిపారు. రాష్ట్రంలో పాఠశాల, ఉన్నతవిద్య కోసం కృషి చేస్తానని, ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యలపై పోరాడతానని ఆయన ప్రకటించారు. విద్యారంగంలో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా నిలుపేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

మంచి ఎమ్మెల్సీగా పనిచేశానన్న తృప్తి : మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ….పోటీలో గెలుపోటములు సహజం. నేనేమీ బాధపడటం లేదు. గతంలో మంచి ఎమ్మెల్సీగా పనిచేశానన్న తృప్తి నాకుంది. గతంలో ఉపాధ్యాయ వర్గం ఆ అవకాశాన్ని నాకు ఇచ్చారు. ఈసారి మరొకరికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. నేను ఓటమిని స్వీకరి స్తున్న తప్ప ఎవరిని నిందించడం లేదు. నాకు ఓటు వేసిన ఉపా ధ్యాయ, ఆధ్యాపక మిత్రులందరికీ ధన్యవాదాలు. అని మాజీ ఎ మ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటిం గ్ అనంతరం రెండవ స్థానంలో నిలిచిన మాజీ ఎమ్మెల్సీ అలుగు బెల్లి నర్సిరెడ్డి మీడియా తో మాట్లాడారు.

విద్యా, వైద్యం అనేది అందరికీ ఉచితంగా అందాలి. విద్య, వైద్య రంగాలను ప్రభుత్వాలు ఉచితంగా ఇచ్చిన నాడే దేశంలో అయినా రాష్ట్రంలో అయినా సమాజం సరైన రీతిలో ముందుకు పోతుంది. ప్రతి ఒక్కరికి ఉచితంగా వాటిని అందించాలన్నదే నా ఆశయం.

తరగతి గది అనేది సమాజాన్ని ప్రతిబింబించాలి తప్ప అంతరాలు ఉండరాదన్నదే నా ఆశయం. ప్రస్తుతం తరగతి గదిలో సమాజం ప్రతిబింబించడం లేదు. డబ్బు మాత్రమే ప్రతిబింబిస్తుంది. దాన్ని నిరోధించాలన్నది నా లక్ష్యం. తదుపరి నా జీవితం ఆ ఉద్యమాల కోసమే కొనసాగుతుంది. ఇప్పటికే పౌర స్పందన వేదిక సంస్థను కూడా ఏర్పాటు చేశానని ఆయన పేర్కొన్నారు.