Model School Entrance Exam : ప్రజాదీవెన, సూర్యాపేట:మోడల్ పాఠశాల అడ్మిషన్ల కొరకు నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు తెలిపారు.ఆదివారం సూర్యాపేట మండలం ఇమంపేట మోడల్ పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షను జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదన పు కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి సమస్య తలెత్తకుండా పారదర్శ కంగా మోడల్ పాఠశాల ప్రవేశాలను నిర్వహించాలని ఈ సంద ర్భంగా తెలిపారు.
అనంతరం దాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీచేశారు కేంద్రాల నుండి ధాన్యం వెంటనే మిల్లులకు తరలించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు పేర్కొన్నారు.ఆదివారం సూర్యాపేట మండ లంలోని ఇమాంపేట ఐ కే పి కొనుగోలు కేంద్రాన్ని,కుడకుడ మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు సందర్శించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇమంపేట కొను గోలు కేంద్రం నుండి ఇప్పటివరకు 3150 క్వింటాల ధాన్యం, కుడ కుడ కొనుగోలు కేంద్రం నుండి 5518 క్వింటాల ధాన్యం తరలించడం జరిగిందని తెలిపారు.రైతులు తాలు లేకుండా తూర్పాల పోసి శుబ్రమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకి తీసుకోనిరావాలని తేమ శాతం 17రాగానే సీరియల్ ప్రకారం కాంట వేసి మిల్లులకు తరలించాలని నిర్వాహకులనకు సూచించారు.
ఆకస్మిక వర్షాలు పడుతున్నందున వడ్లు తడవకుండా టార్పాలిన్ పట్టాలు అందుబాటులో ఉంచుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు.
తదుపరి పెన్ పహాడ్ మండలంలోని వెంకట సాయి రైస్ ఇండస్ట్రీస్,సూర్యాపేట లోని నాగార్జున రైస్ ఇండస్ట్రీస్ లను కలెక్టర్ పి రాంబాబు సందర్శించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ దాన్యం పెండింగ్ పెట్టకుండా వెంటనే దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంఘబంధం అధ్యక్షురాలు నాగమణి, సెంటర్ ఇన్చార్జిలు పద్మ,నాగమణి, తదితరులు పాల్గొన్నారు