Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Amit shah: మోదీ తోనే దేశం సుభిక్షం

దేశం మోదీతోనే సుభిక్షంగా ఉంటుందని, 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి పథంలో, అగ్రభాగాన నిలపాలనేది మోదీ లక్ష్యమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.

రిటైర్మెంట్ బిజేపీ రాజ్యాంగంలో లేదు పూర్తి స్థాయిలో మోదీయే ప్రధాని
ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ అంటే రేవంత్‌, రాహుల్‌ ట్యాక్స్‌
తెలంగాణలో గ్యారెంటీల అమల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం
సర్జికల్‌ స్ట్రైక్స్‌ను ప్రశ్నిస్తున్న రేవం త్ నా ఫేక్‌ వీడియోతో తప్పుచేశారు
పాలమూరు, రంగారెడ్డి సైతం అవి నీతి ప్రాజెక్టే
కేజ్రీవాల్‌కు సుప్రీం క్లీన్‌చీట్‌ ఇవ్వ లేదని గుర్తించండి
వికారాబాద్‌, వనపర్తి జిల్లా కేంద్రా ల్లో జరిగిన బీజేపీ జనసభల్లో అమి త్‌ షా

ప్రజా దీవెన, హైదరాబాద్: దేశం మోదీతోనే(PM modi) సుభిక్షంగా ఉంటుందని, 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి పథంలో, అగ్రభాగాన నిలపాలనేది మోదీ లక్ష్యమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(amit shah) పేర్కొన్నారు.శనివారం వికారాబాద్‌, వనపర్తి జిల్లా కేంద్రాల్లో జరిగిన బీజేపీ జనసభల్లో, హైదరా బాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అమిత్‌షా మాట్లాడా రు.మోదీకి 75 ఏళ్ల వయసు దాటా కా ప్రధాని ఎవరని ప్రశ్నిస్తున్నారని, 75 ఏళ్లు దాటినా మోదీనే ప్రధానిగా ఉంటా రని, 75 ఏళ్ల వయసు దాటి న త ర్వాత రాజకీయాల నుంచి రిటైర్‌ అవ్వాలని బీజేపీ రాజ్యాం గంలో ఎక్కడా లేదని స్పష్టం చేశా రు. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీ వాల్‌, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇటీ వల నిర్వ హించిన ఎన్నికల ప్రచా రంలో మోదీ రిటైర్‌ అవుతారా అంటూ చేసిన వ్యాఖ్యలపై అమిత్‌ షా స్పందించారు.

మోదీ రిటైర్‌ అవుతారంటూ ఇండీకూటమి సం తోషించాల్సిన అవసరమే లేదని సూచించారు. మోదీ మూడో టర్మ్‌ కూడా పూర్తి స్థాయిలో సేవలం దిస్తారని, కానీ దేశాన్ని ముక్కలు చేయాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోం దని లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కుటిలనీతికి పాల్పడుతోందని మండిపడ్డారు. రిజర్వేషన్లను తొలగి స్తామని నేను పేర్కొన్నట్లు వీడియో ను ఎడిట్‌ చేసిన విషయంలో రేవం త్‌రెడ్డి తప్పుచేశారని,శ్రీరామనవమి రోజు భద్రాచలంలో పట్టువస్త్రాలను సమర్పించే సంప్రదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆపేసిందని, కాంగ్రెస్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌, ఇండీ కూట మి నాయకుడు ఫరూఖ్‌ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయని, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే. అమెరికా, ఇజ్రా యెల్‌ తర్వాత సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసిన మూడో దేశం భారత్‌ మాత్రమేనని, అయితే భారత్‌ చేసిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ను మనవాల్లే ప్రశ్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలోకి చొరబడేందుకు యత్నిస్తే ఊరుకునే దిలేదని, శత్రువు భూభాగంలోకి చొచ్చుకువెళ్లి మరీ దాడులు చేస్తాం అని స్పష్టం చేశారు.పాకిస్థాన్‌ వద్ద అణ్వాయుధాలుంటే భయపడాలా అని ప్రశ్నించారు. పౌరసత్వ సవర ణ చట్టం(సీఏఏ) అమలు, 370వ అధికరణ రద్దు, సర్జికల్‌ స్ట్రైక్స్‌ను(surgical strikes) ఇండీ కూటమి నేతలు ప్రశ్నిస్తు న్నారని, రోహింగ్యాలను ఆహ్వాని స్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం(Telangana government) ఇక్కడ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకుండా అండుపడు తోందని దుయ్యబట్టారు. మూడు దశల ఎన్నికల్లో బీజేపీకి 190 సీట్లను ప్రజలు కట్టబెట్టారని, తెలంగాణలో పది కంటే ఎక్కువ సీట్లలో బీజేపీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అమిత్‌షా అభిప్రా యపడ్డారు. ఎన్డీయే 400సీట్లను గెలుచుకోవడం ఖాయమన్నారు. రూ.12లక్షల కోట్ల అవినీతి చేసిన పార్టీ కాంగ్రెస్‌ అని, మోదీ 23 ఏళ్ల లో 25 పైసల అవినీతి కూడా చేయ లేదన్నారు.

రాష్ట్ర ఆవిర్భావ సమ యంలో మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణ ఈ పదేళ్లలో ఆర్థికంగా వెనుకబాటుకు గురైందని, అయితే కేంద్రం భారీగా నిధులిచ్చిందని అమిత్‌షా వెల్లడించారు. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ విషయంలో ఆంధ్రప్ర దేశ్‌కు రూ.15 వేల కోట్లు అందితే, తెలంగాణకు(Telangana) రూ.63 వేల కోట్లిచ్చా మని గుర్తు చేశారు. ఈ పదేళ్లలో రూ.1.62 లక్షల కోట్లను జాతీయ రహదారుల నిర్మాణాలకు, రూ.32 వేల కోట్లను రైల్వే ప్రాజెక్టులకు, రూ. 7వేల కోట్లను విమానా శ్రయాల కు కేటాయించామని గుర్తుచేశారు.

రూ.900 కోట్లతో గిరిజన వర్సిటీ, పసుపు బోర్డును కేటాయించా మన్నారు. రూ.6,500 కోట్లతో రామగుండంలో ఫర్టిలైజర్‌ ఫ్యాక్టరీ పునఃప్రారంభిమచామని చెప్పారు. ఎఫ్‌ఆర్‌బీఎంని మించి తెలంగాణ కు రూ.9వేలకోట్లు రుణం ఇచ్చినం దుకు మోదీకి రేవంత్‌ ధన్యవాదాలు చెప్పాలన్నారు. ఈ నిధులు రాంటే ఉద్యోగులకు జీతాలూ చెల్లించలేక పోయేవారన్నారు. తాము పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను 11 నుంచి 5వ స్థానానికి తీసుకొచ్చామని పేర్కొ న్నారు. బీజేపీకి మూడింట రెండొం తుల మెజారిటీ పదేళ్లుగా ఉందని, రిజర్వేషన్లను తొలగించాలనుకుంటే ఎప్పుడో చేసేవారిమని వ్యాఖ్యానిం చారు. తమకు అలాంటి ఉద్దేశమే లేదని స్పష్టం చేశారు.

Modi developed India country