Mohammad Siraj:ప్రజా దీవెన, హైదరాబాద్ : డీఎస్పీగా టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ (Mohammad Siraj) బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం తెలం గాణ డీజీపీకి రిపోర్టు చేసిన తర్వాత సిరాజ్ అధికారికంగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా DSP)బాధ్యతలు స్వీకరించా రు. సిరాజ్‌కు గ్రూప్-1(group1)స్థాయి ఉద్యో గం ఇస్తామని తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రకటిం చిన సంగతి తెలిసిందే. తాజాగా, మహ్మద్ సిరాజ్ డీఎస్పీగా బాధ్యత లు స్వీకరించారు.టీమిండియా టీ20 వరల్డ్ కప్ (t20 world cup)గెలిచిన జట్టులో హైదరాబాద్కు చెందిన స్టార్ బౌలర్ సిరాజ్ కూడా సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత హైదరా బాద్‌కు వచ్చిన సిరాజ్ సీఎం రేవం త్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా సిరాజ్‌కు క్రికెటర్ మహ్మద్ సిరాజ్కు తెలంగాణ ప్రభుత్వం జూబ్లీహిల్స్ లో 600చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది.అంతర్జాతీయ క్రికెట్లో భారత దేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవాన్ని తెచ్చిన సిరాజ్ను ముఖ్యమంత్రి(cm) అభినందించారు. ఈ క్రమంలో సిరాజ్కు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణ యించారు. ఇప్పుడుఈ రెండు హామీలను ప్రభుత్వం నెరవేర్చింది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.