Mohammed : ప్రజా దీవెన,కోదాడ: కోదాడ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా నియామకమైన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ బషీర్ ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అజ్మత్ అలీ, రెహ్మత్ అలీ ఆధ్వర్యంలో పలువురు ముస్లిం మైనార్టీ నాయకులు ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బషీర్ మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నో ఏళ్లుగా సేవకుడిగా పనిచేస్తున్నానని తనపై నమ్మకంతో పదవి ఇచ్చినా మంత్రి ఉత్తమ్,ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా పేదలకు తన శక్తి వంచన లేకుండా సేవ చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.
శ్రమజీవులకు తాను చేసిన సేవకు ప్రతిఫలంగానే తనకు ఈ పదవి దక్కిందన్నారు. తనకు వచ్చిన ఈ పదవితో పేదలకు ఎంతవరకు వీలైతే అంతవరకు సేవ చేసేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా బషీర్ ను పలువురు అభినందిస్తూ శాలువాలు, పూల బొకేలు అందజేసి స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అజ్మత్ అలీ, రెహ్మాత్ అలీ, మసీదు కమిటీ చైర్మన్ మహమ్మద్, కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ డివిజన్ అధ్యక్షులు షేక్ బాజాన్, ఉద్దండు, షేక్ అబ్బు, శివరామయ్య, నరసింహారావు, కత్తి సైదులు, బెబ్బులు, ఆరిఫ్, అల్తాఫ్,కాజా బాయ్, షేక్ ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.