అన్నింటిలో హవా వారిదే
గతం కన్నా మెరుగైన ఫలితాలు
మొదటి, రెండవ సంవత్సరంలో అమ్మాయిలదే పై చేయి
ప్రధమంలో 57.2.. ద్వితీయంలో 68.45
మే 24 నుండి సప్లమెంటరీ పరీక్షలు
వచ్చే నెల 2 వరకు రీకౌంటింగ్, వి వెరిఫికేషన్ కు అవకాశం
ప్రజా దీవెన నల్లగొండ: తెలంగాణలో ఇంటర్మీడి యట్ పరీక్షల ఫలితాలు(Inter result) వెల్లడయ్యాయి. బుధవారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా (Shruti Oja)ఇంటర్ ఫలితా లను వెల్లడించారు.ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్స్కు సంబంధించి న ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు.
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బాలికలు పైచేయి సాధించారు. మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం రెండింటిలోనూ వారే సత్తా చాటారు. బుధవారం ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్టియర్లో 57.2 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో నల్లగొండ జిల్లా 14వ స్థానంలో నిలవగా, సెకండియర్ లో 68.45 శాతం ఉత్తీర్ణతతో 10వ స్థానంలో నిలిచింది. మొదటి సంవత్సరంలో 11555 మంది విద్యార్థులకు గాను 6610 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 11474 మంది విద్యార్థులకు గాను 7854 మంది పాసయ్యారు.
బాలికలదే పైచేయి….
ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో అమ్మాయిలు(Girls) అదరగొట్టారు. బాలుర కన్నా గణనీయమైన ఉత్తీర్ణత శాతం సాదించారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో 6238 మంది బాలికలకు గాను 65.28 శాతంతో 4071మంది ఉత్తీర్ణులయ్యారు. 5319 మంది బాలురకు గాను 47.73 శాతంతో 2539 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 6084 మంది బాలికలను గాను 74.24 శాతంతో 4517 మంది ఉత్తీ ర్ణత సాధించారు. 5390 మంది బాలురకు గాను 61.91 శాతంతో 3337 మంది ఉత్తీర్ణులయ్యారు.
వృత్తి విద్యలోను బాలికలే ముందు…
ఒకేషనల్ ఫలితాల్లోనూ బాలికలే ముందు వరసలో నిలిచారు. మొదటి సంవత్సరం (First year)ఫలి తాల్లో 992 మంది బాలికలకు గాను 64.18 శాతం తో 636 మంది ఉత్తీర్ణులయ్యారు. 1351 మంది బాలురకు గాను 37.1 శాతంతో 500 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం ఫలి తాల్లో 969 మంది బాలికలను గాను 78.02 శాతం తో 756 మంది ఉత్తీర్ణత సాదించారు. 1198 మంది బాలురకు గాను 48.33 శాతంతో 579 మంది ఉత్తీర్ణత సాధించారు.
మే 24 నుండి 29 వరకు…
ఇక తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాల్లో(Inter result) ఫెయిలైన వారికి మే 24 నుంచి 29 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫస్టియర్ ఉదయం 9 నుంచి మ. 12 గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు మ. 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన పరీక్ష ఫీజును ఏప్రిల్ 25 నుంచి మే 2వ తేదీ వరకు ఆయా కాలేజీల్లో స్వీకరించనున్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు(Re verification) సంబంధించి కూడా ఇదే సమయంలో ఆన్లైన్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రీకౌంటింగ్ కోసం ఒక్కో పేపర్కు రూ. 100, రీకౌంటింగ్కు ఒక్కో పేపర్కు రూ. 600 చెల్లించాలి.
More girls passed in Inter exams