Mousse : ప్రజా దీవెన, హైదరాబాద్: మూసీ నిర్వాసితులకు ఆర్థిక సాయం అం దించటం కోసం తెలంగాణ ప్రభు త్వం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు మూసీ రివర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ.37 కోట్ల 50 లక్షలు నిధులు విడుదల చేస్తూ ఉత్త ర్వులు జారీ చేసింది. తెలంగాణ పురపాలక శాఖ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కా లుష్య కారకాలతో నిండిపోయిన మూసీ నదిని పునరుజ్జీవం చేయా లని తెలంగాణ సర్కారు నిర్ణయిం చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మూసీ సుందరీకరణ కో సం చర్యలు చేపడుతున్నారు.
ఈ క్రమంలోనే మూసీ పరివాహక ప్రాంతాల్లో నివశించేవారిని ప్రభు త్వం ఖాళీ చేయిస్తోంది. మూసీ పరివాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్న వారిని అధికారులు అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు. నిర్వాసితు లకు పునరావాసంతో పాటుగా ఆర్థి క సాయం చేస్తామని తెలంగాణ సర్కారు గతంలో ప్రకటించింది. అందులో భాగంగానే మూసీ పరి వాహక ప్రాంతం నుంచి ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్న కుటుంబాలకు రూ. 25 వేలు ఆర్థిక సాయం అంది స్తోంది. ఈ క్రమంలోనే 15 వేల కు టుంబాలకు 25 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించేం దుకు, ఈ రూ.37.50 కోట్లను వి డుదల చేశారు.మరోవైపు మూసీ నిర్వాసితుల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది.
నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చేందుకు సిద్ధమైం ది. అలాగే హైదరాబాద్‌లోని వేర్వే రు ప్రాంతాల్లో ఉన్న 16 వేలకు పై గా ఇళ్లను వీరికి ఇచ్చేలా గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఇక మూ సీ నది అభివృద్ధి ప్రాజెక్టులో సైతం అధికారులు వేగం పెంచారు. అభి వృద్ధి పనులను ప్రారంభించేందుకు అవసరమైన భూసేకరణ చేపట్టాల ని నిర్ణయించారు.మూడు జిల్లాల పరిధిలోని మూసీ నదిపై సర్వే చేసిన అధికారులు.. మూసీ నదీ గర్భంలోనూ, బఫర్‌జోన్‌లోనూ సుమారు పదివేలకుపైగా నిర్మా ణాలను గుర్తించారు.
జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఇంటింటి సర్వే కూడా నిర్వహించారు. అలాగే పునరావా సం కల్పించిన తర్వాతే ఆక్రమణ లను తొలగిస్తామని అధికారులు చెప్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ నష్టపరిహారం, పునరావాసం అంది స్తామని స్పష్టం చేస్తున్నారు.