Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MP Chamala Kiran: రైతు సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం

–శాలిగౌరారం మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార సభలో ఎంపి చామల కిరణ్, ఎమ్మెల్యే సామేల్

MP Chamala Kiran: ప్రజా దీవెన, శాలిగౌరారం: రైతు సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకా లను మార్కెట్ కమిటీ పాలక మం డలి సభ్యులు రైతులకు అందిస్తూ అండగా ఉండాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నా రు. శాలిగౌరారం వ్యవసాయం మా ర్కెట్ కమిటీ నూతన పాలక మండ లి ప్రమాణ స్వీకారం కార్యక్రమం లో ముఖ్య అతిధులు గా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మె ల్యే మందుల సామెల్ లు పాల్గొని ఛైర్మెన్ పాదూరి శంకర్ రెడ్డిని , వైస్ ఛైర్మెన్ నరిగే నర్సింహాను డైరెక్టర్లను అభినందించి ఘనంగా సన్మానిం చారు.

ఈ సందర్బంగా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఒకే సారి 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి కి దక్కిం దని,రుణమాఫీ కానివారికి అర్హత ఉన్నవారికి కూడా త్వరలో ప్రభు త్వం చేస్తుదన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం చేపట్టుతున్న సంక్షేమ పథ కాలను కాంగ్రెస్ నాయకులు గ్రామా ల్లో ప్రజలకు వివరించాలని కోరా రు. మరో 90 రోజుల్లో స్థానిక ఎన్ని కలు జరుగుతాయాని, దాన్ని దృష్టి లో పెట్టుకొని కార్యకర్తలు కలిసిక ట్టుగా పనిచేయాలన్నారు. ఎమ్మె ల్యే సామేల్ మాట్లాడుతూ ఆరు గ్యారేంటి పథకాలు ఒక్కొక్కటి గా అమలావుతున్నాయని, ఎన్నికలో ఇచ్చిన హామీలన్నీ కాంగ్రస్ ప్రభు త్వం చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలో కష్టపడిన వారికి ఎల్లపుడు గుర్తింపు ఇస్తుoదన్నా రు.

తాను నియోజకవర్గ అభివృ ద్దకి ఎంతో కృషి చేస్తున్నాన్నారు. ఈ కార్యక్రమం లో తహసీల్దార్ పి. యాదగిరి,తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, సింగల్ విండో ఛైర్మెన్ తాళ్లూరి మురళీ,మండల కాంగ్రెస్ అధ్య క్షులు కందాల సమరం రెడ్డి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు అన్నెబోయిన సుధాకర్, మాజీ మార్కెట్ ఛైర్మెన్ చాడ సురేష్ రెడ్డి, నాయకులు షేక్ ఇంతియాజ్ అహ్మద్,గూని వెంకట య్య, నోముల జనార్దన్, చింత ధనుంజయ్,కట్టంగూరి సురేందర్ రెడ్డి,భూపతి అంజయ్య,నోముల రవికుమార్,పుల్లూరి దేవేందర్, బొడ్డు నగేష్, నూతన మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గైగుల్లా అవిల య్య, కుతాటి సోమయ్య,రాజుల శ్రీనివాస్,దేవరకొండ జయరాజ్, పడాల రమేష్, తాందారి సత్తయ్య, బోడ దానయ్య, తుక్కాని లక్ష్మి నర్సింహారెడ్డి,షేక్ లతీఫ్, తానం జోజిరెడ్డి,నాయకులు పాల్గొన్నారు.