MPDO Garlapati Jyoti Lakshmi : ప్రజా దీవెన ,శాలిగౌరారం ఫిబ్రవరి 19: ఎండాకాలం వస్తున్నందున నాటిన మొక్కలను బతికించడానికి నీరు పోసి కాపాడాలని శాలిగౌరారం ఎంపీడీఓ గార్లపాటి జ్యోతి లక్ష్మి కోరారు. బుధవారం మండల పరిషత్తు కార్యాలయం లో పంచాయితీ కార్యదర్శుల, ఫీల్డ్ అసిస్టెంట్లల,టెక్నీకల్ అసిస్టెంట్లల తో మొక్కల పై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎంపీడీఓ జ్యోతి లక్ష్మి మాట్లాడుతూ నర్సరీల లో వందశాతం మొక్కలు మొలకెత్తి ఉండాలన్నారు. షేడెనెట్,ప్రేమరీ బెడ్స్ ఏర్పాటు చేయాలన్నారు. మార్చి చివరి వరకు కూలీలకు బడ్జెట్ పూర్తి చేయాలని కోరారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ సమావేశం లో ఎంపీవో అల్లూరి పద్మ, ఏపిఓ జంగమ్మ తదితరులు ఉన్నారు