MPDO:ప్రజా శాలిగౌరారం, సెప్టెంబర్: సస్పెండ్ చేసిన గుర్రంపోడ్ ఎంపీ డీఓను (MPDO), ఇద్దరు పంచాయితీ కార్య దర్శులను వెంటనే విధుల్లోకి తీసు కోవాలని, లేకపోతే తాము సామూహిక సెలవులు పెడుతామని శాలి గౌరారం మండల పంచాయితీ కార్యదర్శులు శాలిగౌరారం ఎంపీవో పద్మ కు(padma), సూపరిండెంట్ గాదరి సుందరయ్య (Sundaraya)కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ గ్రామ పంచాయితీలకు (Gram Panchayats) నిధులు ఇవ్వకుండా ఆర్ధిక భారాన్ని మోపే విధులను కేటాయిస్తూ తమను మనోవేదనకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లోపంచాయతీ కార్యదర్శుల గౌరవ అధ్యక్షులు కె. ఎన్ చారి, అధ్యక్షులు చింత నరేందర్, ఉపాధ్యక్షులు జె. వెంకన్న, మహేశ్వరం విజయ్ కుమార్, పర్వతం కృష్ణ, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.