Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mptc:ఐదేళ్ల పదవి కాలం పై ఎంపీటీసీ ఆవేదన

Mptc:ప్రజా దీవెన, కోదాడ; ఎంపీటీసీల(mptc,) పదవీకాలం ఐదేళ్లు పూర్తి కావడంతో బుధవారం కోదాడ మండల పరిషత్ కార్యాలయంలో వారికి వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన కూచిపూడి ఎంపిటిసి శంకర శెట్టి కోటేశ్వరరావు (Sankara Shetty koteswara Rao)తన ఆవేదనను వెళ్లబుచ్చుకున్నారు. ఈ ఐదేళ్ల పదవీకాలంలో తాను ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయానని బాధపడ్డారు. ఎంపీటీసీలు కేవలం జనరల్ సమావేశాలకు (general meeting) హాజరై చాయ్ బిస్కెట్ తీసుకునేందుకే పరిమితం అయ్యమని ఆయన బాధపడ్డారు. ఎంపీటీసీలకు గ్రామపంచాయతీ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయంలో (mandal Parishad office) ప్రోటోకాల్ ప్రకారం కనీసం కుర్చీ కూడా ఉండదని ఎంపీటీసీ అయ్యాకే తెలిసిందని ఆయన అన్నారు . ఈ ఐదేళ్ల కాలంలో కేవలం ఐదు లక్షల రూపాయల నిధులు మాత్రమే తనకు మంజూరైనాయి అన్నారు. ఈ నిధులతో ఎం పనులు చక్కబెట్టాలని , సర్పంచి లాగే తాము ప్రజలతో ఎన్నుకోబడ్డప్పటికీ మాకు కనీస గౌరవం లేకుండా పోయిందని తెలిపారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా ఎంపీటీసీలకు కనీస గౌరవం గ్రామపంచాయతీ కేటాయించిన నిధుల్లో సగం మేర కేటాయిస్తే బాగుంటుందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.