MRPS : ప్రజా దీవెన, కోదాడ : ఎం ఆర్ పి ఎస్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాసు గోపి ఆధ్వర్యంలో బుధవారం హుజూర్నగర్ పట్టణ కేంద్రంలో ఆర్డీవో కార్యాలయం ఎదురుగా ఎమ్మార్పీఎస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభోత్సవ
ఈ కార్యక్రమానికి ముఖ్యఅధితులు ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి బోర్జ సైదులు మాదిగ, ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు యాతాకిలా రాజన్న మాదిగ, మున్సిపల్ వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు.
ఈ ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొనిమాట్లాడుతూ హుజూర్నగర్ పట్టణ కేంద్రంలో ఎమ్మార్పీఎస్ కార్యాలయం ప్రారంభించుకోవటం అభినందనీయమని వారు తెలిపారు ఎమ్మార్పీఎస్ ఉద్యమం పోరాటలొ ఎన్నో అంవతరాలకు గురైనప్పటికిని వెనుతిరగక ఆలు పెరగని పోరాటం కొనసాగించి ఏబిసిడి వర్గీకరణ దిశగా పయనం సాగిస్తూ సమాజానికి ఉపయోగకరమైన ఉద్యమాలు చేపట్టి నేడు దేశంలోనే గుర్తింపు పొందిన ఉద్యమంగా రూపు దాల్చుకున్న ఉద్యమం ఎమ్మార్పీఎస్ ఉద్యమం అన్నారు .
ఈ కార్యక్రమంలో ఎం జె ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గాదే రమేష్, ఎం జె ఎఫ్ రాష్ట్ర నాయకులు పడిశాల రఘు, ఎం జె ఎఫ్ సీనియర్ నాయకులు బంక వెంకటరత్నం, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు చింత్రియాల బాలచంద్రుడు, మంద భిక్షం, భీమప్పంగు శీను, , మండల అధ్యక్షులు మేరుగ మట్టపల్లి, ఇరుకు ప్రభు అరుణ్, విజయ్, ఎం జె ఎఫ్ జిల్లా సంయుక్త కార్యదర్శి కొమ్ము మహేష్, జిల్లా సహాయ కార్యదర్శి కాంపాటి సందీప్,ఎం జె ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు బయ్యారపు రవీందర్ నియోజకవర్గ కోశాధికారి రుద్ర పొంగు శ్యామ్, ఎం జె ఎఫ్ మఠంపల్లి మండలం అధ్యక్షులు సుధాకర్ మాజీ ఎంపీపీ గరిడేపల్లి శీను,గ్రామ శాఖ అధ్యక్షులు ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పి ఎం జె ఎఫ్ అనుబంధ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు .