Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mrpsmandhakrishamadhiga : కండువాలు మార్చo, స్వతంత్రంగానే కొనసాగుతాo

--టీయుడబ్లూజే మీట్ ది ప్రెస్ లో మందకృష్ణ మాదిగ స్పష్టీకరణ

కండువాలు మార్చo, స్వతంత్రంగానే కొనసాగుతాo

–టీయుడబ్లూజే మీట్ ది ప్రెస్ లో మందకృష్ణ మాదిగ స్పష్టీకరణ

Mrpsmandhakrishamadhiga:  ప్రజా దీవెన, హైదరా బాద్: మాదిగ రిజర్వేషన్ పోరాటం ద్వారా సాధిం చుకున్న ఏబిసిడి వర్గీకరణను జీ ర్ణించుకోలేక పోతున్న శక్తు లు తన పై లేనిపోని వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా పెట్టుకు న్నా యని ఎ మ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై పథకం ప్రకారం తనపై రాజకీయ ముద్ర మోపి, లక్షలాది మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయ త్నాలు చేస్తున్నారని, వర్గీకరణ అమలయ్యేంత వరకు తాను పోరా డుతూనే ఉంటా నని, భవిష్యత్తులో కూడా ఏ రాజకీయ పార్టీ కండు వా కప్పుకునేది లేదని, స్వతంత్రంగానే తన కార్యక లాపాలు కొన సాగిస్తానని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితీ వ్యవ స్థాపక అధ్య క్షులు మంద కృష్ణ మాదిగ స్పష్టం చేశారు.

తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టియుడబ్లూ జె) ఆధ్వ ర్యంలో సోమ‌వారం ‘లక్ష డప్పు లు – వేల గొంతుల’ కార్య క్రమంపై మీట్ ది ప్రెస్ నిర్వహించారు. టియుడ బ్లూజె అధ్యక్షులు కె.విరాహత్ అలీ మీట్ ది ప్రెస్ కు స‌మ‌న్వ‌య క‌ర్త‌గా వ్య‌వ‌హారించ‌ గా ,టియుడ బ్లూజె ప్రధాన కార్యదర్శి కె.రాం నారాయణ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు మంద‌కృ ష్ణ‌ మాదిగ సమాధాన‌మిచ్చారు.

సుప్రీం కోర్టు తీర్పును కూడా రాష్ట్రంలో గౌరవించక పోవడం విచా రకరమన్నారు. ఎస్ సి వర్గికరణను అమలు చేస్తామని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారన్నారు. వర్గీకరణను అమలు చేసేందుకు ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి, దేశంలోనే తెలంగాణ మొట్టమొ దలుగా అమలు చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వర్గీకరణను అమలు చేయకుండా కాంగ్రెస్ మాల సామాజికవర్గం ప్రజా ప్రతినిధులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ ను శాసిస్తున్న మాల సామాజిక వర్గం వత్తిళ్లకు తలొగ్గిన సిఎం రేవంత్ రెడ్డి వర్గీకరణను అమలు చేయడం లేదన్నారు. అందుకే హైదరాబాద్ ఫిబ్రవరి 7వ తేదీన ‘లక్ష డప్పులు – వేల గొంతుల’ సాంస్కృతిక కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు.గత సంవత్సరం ఆగస్టు 1వ తేదీన సుప్రీం కోర్టు వర్గీకరణకు అనుకూలం గా తీర్పునిచ్చిందని, నాలుగు నెలల 26 రోజులు గడుస్తున్న రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వర్గీకరణను అమలు చేయడం లేదని మంద కృష్ణ మాదిగ ఆరోపించారు.

అందరికంటే ముందే తెలంగాణలో అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సిఎం రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గారన్నారు. వర్గీకరణను చేయ‌కుండానే ఉద్యోగ నోటీఫికేషన్ల‌ను జారీ చేస్తున్నా ర‌ని, గ్రూప్ -1, 2, 3 అమలు భ‌ర్తీ చేసేందుకు రంగం సిద్దం చేశా రన్నారు. వర్గీకరణ జరగకుండానే ఇప్పటికే టీచర్ పోస్టులు భర్తీ చేశారన్నారు. ఈ మూడు మాటాలకు రేవంత్ రెడ్డి కట్టుబడి ఉంటే తాము రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఉండేదికాదన్నారు. అందుకే తాము సాంస్కృతిక, వాయిద్యా ఉద్యమాన్ని చేపడుతున్నామని వివ‌రించారు.

వర్గీకరణపై సమాజం ఎటువైపు ఉండాలనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతుందన్నారు. సమాజమంతా వర్గీకరణ న్యాయమైందని, వర్గీకరణకే మద్దతు ఇస్తుందని తెలిపారు. ఎస్సిల జాబితాలో 59 కూలాలు ఉంటే, 58 కులాలు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాయ న్నారు. వర్గీకరణ న్యాయమైనదే అనే విషయాన్ని అనేక కమిషన్లు తమ నివేదికలు సమర్పించాయన్నారు. తెలంగాణలో అన్ని రాజ కీయ పార్టీలు ఏకగ్రీవంగా వర్గీకరణకు మద్దతు ఇచ్చాయని, దేశంలో మెజారిటీ పార్టీలు వర్గీకరణకు మద్దతు ఇస్తున్నాయన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో బిఆర్ఎస్ , కాంగ్రెస్, టిడిపి ఎంఎల్ఎలు మద్దతు ఇచ్చారన్నారు. జాతీయ స్థాయిలో జెడిఎస్, ఆప్, శివసేన, లాలు ప్రసాద్ యాదవ్ పార్టీలు మద్దతు ఇచ్చాయని తెలిపారు. వర్గీకరణపై 1999లో రాష్ట్రపతి అభిప్రాయం కోరిందని, అప్పటి రాష్ట్రపతి కె. ఆర్.నారాయణన్ వర్గీకరణ అమలు చేయాలని స్పష్టం చేశార న్నారు. యుపిఏ ప్రభుత్వ హయంలో ఉషామేహ్ర కమిషన్ ఏర్పాటు చేశారని, ఉమ్మడి రాష్ట్రంలో నాలుగేళ్లు వర్గీకరణ అమలు జరిగిందని వివ‌రించారు.

వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీం తీర్పు వచ్చిన 24 గంటల్లోనే రద్దు చేయించారని, 1999లో నోటీఫికేషన్ వర్గీకరణ అమలు చేశారని అన్నారు. ఇప్పుడు అనుకూలంగా తీర్పు వచ్చి నాలుగు నెలల 26 రోజుల వుతున్నప్ప‌టికీ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించా రు. రద్దు అయిన చట్టాన్ని పునరుద్దరించాలన్నారు. వందల సం వత్సరాల క్రిత‌మే డప్పులు ప్రజలకు సమాచారం అందవేశా యని మంద కృష్ణ మాదిగ అన్నారు. ఫిబ్రవరి 7న మాదిగల గుండె చప్పు ళ్లు, కోట్లాది మంది ఆకాంక్షలు, కోట్ల గొంతుకలతో ప్రపంచంలోనే మొట్టమొదటి సాంస్కృతిక వాయిద్యా ఉద్యమానికి హైదరాబాద్ వేదిక కాబోతుందన్నారు.

తాము గతంలో నిర్వహించిన అనేక పోరాట కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి పాల్గొని సంఘీభావం ప్రకటించారని, రేవంత్ రెడ్డి సిఎం అయ్యా క ఒక్క వ్యతిరేక ప్రకటన కూడా తాము ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ను శాసించే రెండు కుటుంబాలు రేవంత్ రెడ్డికి బ్రేకులు వేశాయని తెలి పారు. ఒక మల్లు, మరోకటి వెంకట స్వామి కుటుంబం మాత్ర‌మే బ్రే కులు వేస్తున్నాయ‌ని ఆరోపించారు. ఈ రెండు కుటుంబాలకు కాం గ్రెస్ లో మంచి పలుకుబడి ఉందన్నారు. కాంగ్రెస్ జాతీయ నేత కె.సి .వేణుగోపాల్ వర్గీకరణను అమలు చేయవద్దు అని చెప్పడం తోనే రేవంత్ రెడ్డి అమలు చేయడం లేదన్నారు.

రాహుల్, మల్లికార్జున్ ఖర్గే తమ ఎన్నికల మేనిఫేస్టోలో వర్గీకరణకు అనుకూలమని ప్రకటించిన విషయాన్ని కృష్ణ మాదిగ గుర్తు చేశారు. గద్వాల్ సభలో రాహుల్ గాంధీ ప్రకటించారని, కాంగ్రెస్ జాతీయ కమిటీ ఆమోదం లేకుండానే ప్రకటించారా? అని ప్రశ్నించారు.
లేఖ రాసి ఊరుకున్నారమో.. పద్మ అవార్డులు తనకు ప్రకటించడం పట్ల సిఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారన్నారు. కానీ తాము పంపించిన జాబితాలో ఎవ్వరికీ రాలేదని అన్నారని మంద కృష్ణ అన్నారు. మాల సామాజిక వర్గానికి చెందిన గద్దర్, అదేశ్రీ, గొరటి వెంకన్న లాంటి వారి పేర్లతో జాబితా పంపించారని, కేవలం లేఖరాసి ఊరుకున్నారమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

పద్మ అవార్డులు ఇవ్వాల్సిన వ్యక్తుల ప్రతిభ గురించి కేంద్రానికి చెప్పి ఇప్పించాల్సిందని చెప్పారు. మాదిగ రిజర్వేషన్ పాటు సామాజిక ఉద్యమాలు నడిపిన నేపథ్యం తనకు ఉందన్నారు. ఆరోగ్యశ్రీ, విక లాంగుల పెన్షన్ లాంటి సామాజిక మార్పులు తీసుకొచ్చిన చరిత్ర తనదని మంద‌కృష్ణ మాదిగ అన్నారు.