ప్రజా దీవెన, శాలిగౌరారం: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ను జనవరి 1 నుంచి రాష్ట్రం లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గా విలీనం చేస్తున్నందున ఈ నెల 28 నుంచి 31 వరకు బ్యాంకింగ్ సేవలు నిలుపుదల చేయనున్నట్లు శాలిగౌరారం ఏపిజీవిబి బ్యాంక్ మేనేజర్ ముడావత్ జామ్లా తెలిపారు.
అయన బ్యాంక్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ మండల పరిధిలోని ఖాతాదారులు ఈ నెల 27 లోపు బ్యాంకింగ్ అవసరాలను పూర్తి చేసుకోవాలన్నారు.బ్యాంక్ కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే వినియోగదారులు బ్యాంక్ ను సంప్రదించాలని మేనేజర్ జామ్లా కోరారు.ఈ సమావేశం లో క్యాషియర్ ఏ. కోటేశ్వరరావు, మెసెంజర్ ఎన్. రామనర్షయ్య, ఫిల్డ్ ఆఫీసర్ ఏ. ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.