Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mudireddy Sudhakar Reddy: అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులివ్వాలి

Mudireddy Sudhakar Reddy: ప్రజా దీవెన, కనగల్: రాష్ట్ర ప్రభు త్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అర్హులైన పేదలందరి కీ రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి (Mudireddy Sudhakar Reddy) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం కనగల్లు మండలం ఎడవల్లి గ్రామంలో సిపిఎం గ్రామ శాఖ మహాసభ కానుగు లింగస్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భం గా ముఖ్య అతిథిగా హాజరైన సుధాకర్ రెడ్డి (Mudireddy Sudhakar Reddy) మాట్లాడుతూ ఇటీ వల జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కొక్కటిగా అమలు అమలు జరపడంలో ఆలస్యం చేస్తున్నారని పేర్కొన్నారు ఇప్పటివరకు రుణమాఫీ 60% కు మించి జరగలేదని అన్నారు కుంటి సాకుల పేరుతో 40% మందికి ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు అలాగే ఖరీఫ్ రైతు భరోసా అమలు చేయకపోవడం వలన ప్రైవేటు వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడి ఆధారపడటంతో రైతాంగం తీవ్రమైన అప్పుల భారంతో సంక్షోభంలోకి నెట్టవేయబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు వెంటనే వెంటనే రైతు భరోసా (Farmer’s Assurance) నిధులను విడుదల చేయాలని కోరారు.

ఖరీఫ్లో వరి పంట వస్తుండడంతో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఐకెపి కేంద్రాలను (IKP Centres) ప్రారంభించాలని అలాగే తగిన మద్దతు ధరను ప్రకటించి కొనుగోలు చేయాలని , అన్ని రకాల ధాన్యానికి 500 బోనస్ ఖరీఫ్ నుండే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కాలంలో కురిసిన వర్షాలతో పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని వాటిని పరిశీలించి వెంటనే నష్టపరిహారం చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జనాభాలో సగభాగమైన మహిళలకు (For women)వడ్డీ లేని రుణాలు పది లక్షలు ఇవ్వాలని అన్నారు ప్రతి మహిళకు మహాలక్ష్మి స్కీం క్రింద 2500 ఎప్పటినుండి అమలు చేస్తారో తెలియజేయాలని కోరారు. జిల్లాలో సీజనల్ వ్యాధుల బారినపడి ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని విష జ్వరాలపై సర్వే చేసి ఏ కుటుంబానికి ఏది అవసరమో ఆ మందులు ఇస్తూ తగిన సూచనలు చేయాలని అవసరమైన వైద్యం ప్రజలకు అందించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల పారిశుద్ధ్యం మరియు ఇతర ఖర్చులకు వెంటనే జనాభా ప్రాతిపదికన నిధులను మంజూరు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం (CPM)జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు పాలడుగు ప్రభావతి పాల్గొని మాట్లాడారు. కణగల్ మండల నాయకులు కానుగు లింగస్వామి సుల్తానా, అక్రమ్, శాఖ కార్యదర్శీ కొర్విబిక్షం, నాగయ్య, రవి, సత్తయ్య, ధనమ్మ,కర్రయ్య,చంద్రయ్య, వెంకన్న తదితరులు పాల్గోన్నారు. నూతన కార్యదర్శిగా పర్సనబోయిన శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికైనారు.