Suryapet Police : ప్రజాదీవెన, సూర్యాపేట: మల్టీ జోన్ పరిధిలోని జిల్లాల సందర్శ నలో భాగంగా బుధవారం మల్టీజో న్ టు ఇన్చార్జి ఐజిపి తప్సీర్ ఇక్బా ల్ ఐపిఎస్ సూర్యాపేట జిల్లా పో లీస్ కార్యాలయాన్ని సందర్శించా రు. అంతకు ముందు జిల్లా ఎస్పీ నరసింహ పోలీసుగౌరవ వందనం తో స్వాగతం పలికి పోలీస్ కార్యా లయం ప్రాంగణంలో పోలీసు అధి కారులతో కలిసి మొక్కలు నాటా రు. అనంతరం సమావేశ మందిరం నందు ఎస్పీతో కలిసి సిఐలు డీఎ స్పీలతో సమావేశం నిర్వహించారు. ముందుగా జిల్లా భౌగోళిక పరిస్థితు లు, జిల్లాలో ఉన్న ప్రముఖ ప్రాంతా లు, ప్రముఖ వృత్తులు, జనాభా, రా జకీయ పరిస్థితులు, ఈ సంవత్స రంలో నమోదైన నేరాలు వాటి తీ రుతెన్నులు, నేరాల నివారణలో జి ల్లా పోలీసు ప్రణాళిక, రాబోవు స్థా నిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వా తావరణంలో జరపటానికి తీసుకో బోతున్న చర్యలు, పోలీసు ప్రజా భ రోసా, ప్రజా అవగాహన చైతన్య కా ర్యక్రమాలు, కళాబృందం, షీ టీమ్స్, భరోసా టీమ్స్ మొదలగు అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేష న్ ద్వారా జిల్లా ఎస్పీ నరసింహ ఇ న్చార్జ్ ఐజిపికి వివరించారు. కేసుల నమోదు, ఫిర్యాదుల నిర్వహణ, పోలీస్ ప్రజా భరోసా, పబ్లిక్ ఫీడ్ బ్యాక్, కోర్టు మానిటరింగ్, డయల్ 100 స్పందన, ఎన్ఫోర్స్మెంట్, ప్రజా అవగాహన కార్యక్రమాలు, పోలీసు పని తీరు, కేసు దర్యాప్తు, నైపు ణ్యాలను ఇన్చార్జి ఐజిపీ పరిశీలిం చారు. పోలీసు అధికారులకు పలు సూచనలు సలహాలు అందించారు.
ఈ సందర్భంగా తఫ్సీర్ ఇక్బాల్ మా ట్లాడుతూ నేరాల నివారణలో ముం దస్తు ప్రణాళికతో పని చేయాలని, కే సుల దర్యాప్తులో నైపుణ్యం చూపా లని ఆదేశించారు. నేరాల నివారణ కు ముందస్తుగా పని చేయాలి, క్షేత్ర స్థాయిలో సంచారం సేకరించాలి. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతవరణంలో నిర్వహించడానికి సిద్దంగా ఉండాలి అని అన్నారు, సమస్యాత్మక విషయాలపై దృష్టి పెట్టాలి, గ్రామ పోలీసు అధికారిని యాక్టీవ్ చేసి గ్రామాల్లో సమస్యలపై దృష్టి పెట్టాలి. చిన్న సమస్యలు కొ న్ని సందర్భాల్లో తీవ్ర సమస్యగా మారుతాయి ఇలాంటి వాటిని ఆది లోనే పరిష్కరించాలన్నారు. ఎన్ని కల సమయంలో గతంలో ఎలాంటి సమస్యలు వచ్చాయి అనేది పరి శీలించుకుని పని చేయాలన్నారు.
ప్రతి అంశంపై నిశిత పరిశీలన పె ట్టాలి అని ఆదేశించారు. భౌతిక దా డుల జరగకుండా చూడాలి. పాత నేరస్తులు సమస్యలు సృష్టించే అవ కాశం ఉన్న వ్యక్తులు రౌడీలు కేడీల ను ముందస్తుగా బైండోవర్ చేయా లి, పాత నేరస్తులను, ట్రబుల్ మాం గర్స్ ను చెచ్చరించాలన్నారు. దొంగ తనం ద్వారా పోయే డబ్బు కన్న సై బర్ మోసం ద్వారా పోయే డబ్బు ఎక్కువగా ఉంటుంది కొత్త తరహా లో నేరాలు జారుతున్నాయి, పోలీ సులు కూడా కొత్త తరహాలో అలొ సుచి నేరాలు జరగకుండా ప్రజలకు, విద్యార్థులకు సైబర్ మోసాలపై అవ గాహన కల్పించాలి, ప్రజలతో మ ర్యాదగా మసులుకోవలి. సూర్యా పేట చాలా ప్రశాంతత కలిగిన జిల్లా అక్రమ కార్యకలాపాల పై కటినంగా పని చేయాలి అన్నారు.
పాఠశాలలు, కళాశాలల్లో విద్యా ర్థుల ను చైతన్య పరిచి రక్షణ కల్పిం చాలి. డ్రగ్స్ లాంటి వ్యసనాలకు లో నూ కాకుండా నిఘా ఉంచాలి,ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ జరగకుండా వి ద్యాసంస్థల్లో కమిటీలు ఏర్పాటు చే యాలి. పిల్లల అక్రమ రవాణా జర గకుండా చూడాలి, బాలకార్మిక వ్య వస్థ ను సమూలంగా నిర్మూలించా లి, జిల్లా యంత్రాంగం వారితో స మన్వయంగా పని చేయాలని కోరా రు.
ఎస్పీ నరసింహ మాట్లాడుతూ ఆ దేశాలను జిల్లాలో అమలు చేస్తామ ని ప్రోయాక్టివ్ గా పని చేస్తూ నేరా లను నివారించడంలో బాగా కృషి చేస్తామని తెలిపారు. రాబోవు స్థా నిక సంస్థల ఎన్నికల్లో పటిష్టంగా పనిచేసే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమం నందు అదనపు ఎ స్పి రవీందర్ రెడ్డి, AR అధనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, సూర్యాపేట డివిజన్ DSP ప్రసన్న కుమార్, కోదాడ డివిజన్ DSP శ్రీధర్ రెడ్డి, AR DSP నరసింహ చారి, AO మంజు భార్గవి, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ హరిబాబు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్బి ఇన్స్పెక్టర్ రంజి త్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్లు రాజ శేఖర్, వెంకటయ్య, నరసింహా రావు, నాగేశ్వరరావు, చరమంద రాజు, రామకృష్ణారెడ్డి, రజిత రెడ్డి, IT కోర్ RSI రాజశేఖర్, సిబ్బంది ఉన్నారు.