C.H. Hanmanthareddy : ప్రజాదీవెన, సూర్యాపేట : “స్వభావ్ స్వచ్ఛత, సంస్కార్ స్వచ్ఛత” నినాదంతో 2025 ఎస్.ఏ.బి.బి. సఫాయి అప్నావ్ బిమారి భాగో అంటే “స్వచ్ఛతను అవలంబించండి, రోగాలను తరలించండని లేదా “శుభ్రతను స్వీకరించండి, వ్యాధులను తొలగించండని మున్సిపల్ కమిషనర్ సి.ఎచ్.హన్మంత రెడ్డి పేర్కొన్నారు.ఇది ప్రజలకు పరిశుభ్రత మీద అవగాహన కల్పించి, వాతావరణాన్ని శుభ్రంగా ఉంచటం ద్వారా వ్యాధులు దూరం చేసుకోవాలని సూచించే ఒక నినాదం అని తెలిపారు.శుక్రవారం 100 రోజుల కార్యచరణలో భాగంగా స్థానిక 30వ వార్డులోని హైటెక్ బస్టాండ్ వెనుక జరిగిన కార్యక్రమంలో ప్రచారాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో నీటి ద్వారా, వాహక జీవుల ద్వారా వచ్చే వ్యాధులను నివారించడానికి ప్రతి పౌరుడు, విద్యార్థి స్వచ్ఛతను క్రమంగా అలవర్చుకోవాలని చెప్పారు.వాతావరణ పరిరక్షణ, ఆరోగ్య భద్రతకు ప్రజల భాగస్వామ్యం అవసరం అన్నారు. ఇందులో భాగంగా ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులకు కూడా కమిషనర్ స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. వర్షాకాలానికి ముందు ప్రతి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని, వ్యాధుల వ్యాప్తిని అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. అలాగే, ఇంటి చెత్తను తడి, పొడి, హానికరంగా వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అప్పగించాలని, వీధుల్లో సంచరించే కుక్కలకు బెల్టులు, టీకాలు వేయాలని సూచించారు.ఈ
కార్యక్రమంలో సానిటరీ ఇన్‌స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్,డి.ఈ.సత్యారావు ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శివప్రసాద్, టీఎంసీ శ్వేత, స్కూల్ ప్రిన్సిపాల్ పి. వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు రేణుక, రెహనా, జ్యోతి, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.