Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Munneru River : వరద సహాయక చర్యల్లో ముగ్గురు అమాత్యులు

Munneru River : ప్రజా దీవెన, ఖమ్మం: మున్నేరు వాగు(Munneru River) ఉగ్రరూపం దాల్చడంతో ఎదురయ్యే ప్రమాదాలను నివారించేందుకు ముగ్గురు అమాత్యు లు రంగంలోకి దిగారు. కనుక పొం గితే లోతట్టు ప్రాంతాలన్నీ జలమ యం అయిపోతాయి. నష్టం ఎక్కు వగా వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టు కుని అధికారులు అప్రమత్తమ య్యారు. ఇప్పటికే 16 అడుగులకు నీటి మట్టం చేరడం తో మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేసారు. ఈ క్రమంలో భారీ వర్షాలు, వరద హెచ్చరిక (Heavy rains, flood warning) ల నేపథ్యం లో ఉప ము ఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి లు రాత్రి నుంచి ఖమ్మంలో మకాం వేశారు.

ఇక లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజ లను ముందస్తుగానే హెచ్చరించా లని అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు వరద ఉద్ధృతి మీద అధికారులతో సమీక్ష నిర్వహించారు. అక్కడ ఉన్న ప్రజ లకు ఇబ్బంది కలగకుండా చూడా లని చెప్పారు. ముంపు బాధితుల ను పునరావాస కేంద్రాలకు తరలిం చాలని కలెక్టర్‌ (collector), మున్సిపల్‌ కమిష నర్‌లను ఆదేశించారు.భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం పట్టణంలో మున్నేరు వాగు దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలను ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలిం చేలా చర్యలు చేపట్టాలని తెలి పారు. ఖమ్మం పట్టణంలోని స్వర్ణ భారతి పునరావాస శిబిరంలో (Bharti Resettlement Camp) వరద ముంపు బాధితులని కలిసి పరామర్శించి మనో ధైర్యం నిం పారు.

పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆహారం, నీళ్లు అందు బాటులో ఉండేలా మిగతా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకో వాలని అధికారులను ఆదేశించా రు.ఖమ్మం జిల్లాలో భారీగా వర్షా లకు (Heavy rains) కురుస్తుండటంతో మున్నేరు కు వరద ఉద్ధృతి పెరిగిందని మం త్రి తుమ్మల నాగేశ్వరరావు తెలి పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండా లని మంత్రి విజ్ఞప్తి చేశారు. వరదల రాకుండా ఉండేందుకు, వచ్చినా ఎక్కువ నష్టం జరగకుండా చూసు కునేందుకు ప్రభుత్వం తక్షణ చర్య లు తీసుకుంటోందని సహాయక శిబిరాలను మళ్లీ తెరవాలని అధికారులను ఆదేశించామని తుమ్మల తెలిపారు. లోతట్టు ప్రాం తాల ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలకు వెళ్లా లని కోరారు. పరిస్థితులు అదుపు లోకి వచ్చేంత వరకు సహాయ కా ర్యక్రమాలు కొనసాగుతాయన్నా రు.ఇక మంత్రి సీతక్క ఆ జిల్లా అధికారులతో అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వెంటనే మున్నేరు వరద పరివాహక ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి.. వారికి కావాల్సిన ఆహార, ఇతర ఏర్పాట్లను చూడలని అధికారులకు మంత్రి సీతక్క (Sitakka) ఆదేశాలు ఇచ్చారు.