Murder : ప్రజా దీవెన, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి చెరు వు కట్టపై యువకుని దారుణ హ త్య జరిగింది. చెరువుకట్టపై మృతదేహం తో పాటు పక్కన నెం బర్ ప్లేట్ లేని స్కూటిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచా రం ఇవ్వడంతో సంఘటనస్థలికి చేరుకుని విచారణ ప్రారంభిం చారు. మృతుడు సూర్యాపేట పట్టణం మామిల్లగడ్డకు చెందిన మాల కృష్ణ (బంటి) గా గుర్తిం చా రు.
అయితే ఆరు నెలల క్రితమే ఓ యువతిని కృష్ణ ప్రేమ వివాహం చే సుకున్నట్లు చెబుతున్నారు.ప్రేమ వ్యవహారమే హత్యకు దారి తీసి నట్టు అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో ఘటన స్థలానికి చే రు కుని దర్యాప్తు చేపట్టినట్లు రూరల్ పోలీసులు తెలిపారు.